అందరి టార్గెట్ కేసీఆరే ? అందుకే ఫలితం ఇలా ?

హుజురాబాద్ ఎన్నికల ఫలితం తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఎన్నో కీలక పరిణామాలు చోటు చేసుకోవడానికి కారణం అయ్యాయి.ముఖ్యంగా ఇక్కడ గెలుస్తామని ఎంతో నమ్మకం తో ఉన్న అధికార పార్టీ టిఆర్ఎస్ కు ఈ ఫలితాలు తీవ్ర నిరాశ కలిగించాయి.

 With All The Trs- Opposition Parties Uniting In Huzurabad Ethela Rajender Won Kc-TeluguStop.com

ఈ ఫలితాల ప్రభావం రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తప్పనిసరిగా ఉంటుందనే భయం అధికార పార్టీ లో నెలకొంది.ఈటెల రాజేందర్ ఎంత కష్టపడినా , హుజురాబాద్ నియోజకవర్గ ఫలితం టిఆర్ఎస్ కు అనుకూలంగానే ఉంటుందని అంతా అంచనా వేశారు.

అయినా ఇక్కడ రాజేందర్ గెలిచారు.  ఆయన గెలుపునకు ఎన్నో అంశాలు దోహదం చేశాయి.

టిఆర్ఎస్ తరఫున మంత్రి హరీష్ రావు అన్నీ తానై నడిపించారు.అలాగే ఈటెల రాజేందర్ ప్రధాన అనుచరులు అందరినీ టిఆర్ఎస్ లో చేర్చుకోవడం, భారీ ఎత్తున సంక్షేమ పథకాలు ఈ నియోజకవర్గంలో ప్రవేశపెట్టడం,  ఇలా ఎన్ని చేసినా, టిఆర్ఎస్ కు నిరాశే ఎదురైంది.

        దళిత బందు వంటి పథకాలు కూడా టిఆర్ఎస్ కు కలిసి రాలేదు.అయితే ఇక్కడ అనూహ్యంగా రాజేందర్ గెలవడానికి ఎన్నో అంశాలు దోహదం చేశాయి.  ముఖ్యంగా టిఆర్ఎస్ శత్రువులు అంతా ఏకమై రాజేందర్ గెలుపు కోసం కష్ట పడటం , ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరగడం, కాంగ్రెస్ సైతం పరోక్షంగా రాజేందర్ కు మద్దతు ఇచ్చినట్లుగానే వ్యవహరించడం, ఇవన్నీ బాగా కలిసి వచ్చాయి.టిఆర్ఎస్ వ్యతిరేక శక్తులు అన్నిటినీ ఏకం చేసుకుని తనకు మద్దతిచ్చే చేసుకోవడంలో రాజేందర్ కూడా సక్సెస్ అయ్యారు .అందుకే ఈటెల రాజేందర్ గెలుపు ఈజీ అయ్యింది.ఈ హుజూరాబాద్ నియోజకవర్గం లో ఎవరు గెలిచినా పర్వాలేదు కానీ , టిఆర్ఎస్ మాత్రం గెలవ కూడదు అనే పట్టుదలతో చాలామంది టిఆర్ఎస్ వ్యతిరేకులు రాజేందర్ పార్టీలకతీతంగా పనిచేయడం ఇవన్నీ కలిసి వచ్చాయి.
   

Telugu Hareesh Rao, Hujurabad, Komati Venkat, Revanth Reddy, Telangana, Telangan

     ఒకవేళ హుజూరాబాద్ నియోజకవర్గం లో టిఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది అనే భయం ఎక్కువ మంది.లో ఉండడంతోనే వారంతా బలమైన అభ్యర్థిగా రాజేందర్ కు మద్దతు ఇచ్చినట్లు కనిపిస్తున్నారు .ఈ విషయంలో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సహకారం రాజేంద్ర ఎక్కువగా ఉందనే ప్రచారం జరిగింది .ఈ విషయంలో సొంత పార్టీ నాయకుల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు.ఏది ఏదైతేనేం టీఆర్ఎస్ వ్యతిరేక పార్టీల ఆశయం హుజురాబాద్ నియోజకవర్గంలో నెరవేరింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube