ఒక్క నోటిఫికేషన్ తో రూ. 41 లక్షలు హరి..!  

man lost 41 lakhs rupees to fake forex app with a single Facebook notification, single, cyber crime, tradeing app, fake app, notification, 14 lakhs, arrest, aditya narayan, madhya pradesh, nagole, fake app, forex trading - Telugu 14 Lakhs, Aditya Narayan, Arrest, Cyber Crime, Fake App, Forex Trading, Madhya Pradesh, Nagole, Notification, Trading App

ప్రస్తుత రోజుల్లో చిన్న పిల్లవాడి నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ ఫోన్ వినియోగం బాగా ఎక్కువైపోయింది.ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్ లో వారి కాలక్షేప సమయాన్ని గడిపేస్తున్నారు.

TeluguStop.com - With A Single Notification A Man Lost Rs 41 Lakhs To Fake Forex App

ఇదే ఆసరగా చేసుకున్న కొంతమంది వ్యక్తులు ఆన్లైన్ లో నకిలీ యాప్ లను సృష్టించి అనేక మోసాలకు పాల్పడుతున్నారు.ఇందుకు సైబర్ క్రైమ్ పోలీసులు ప్రజలను  అనేకసార్లు హెచ్చరిస్తున్న కానీ.

కొంతమంది వారి చేతిలో బలి అవుతూనే ఉన్నారు.

TeluguStop.com - ఒక్క నోటిఫికేషన్ తో రూ. 41 లక్షలు హరి..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

తాజాగా మధ్యప్రదేశ్ కు చెందిన ఆదిత్య నారాయణ్ అనే వ్యక్తి  ఒక యాప్ ను సృష్టించి మోసాలకు పాల్పడుతున్న తరుణంలో అతడిని గుర్తించి రాచకొండ సైబర్ క్రైమ్ పోలీస్ ఆఫీసర్స్ అరెస్ట్ చేశారు.అలాగే నిందితుడు ఆదిత్య నుంచి 11.50 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు.పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు నాగోల్ కు చెందిన ఒక వ్యక్తి ఫేస్బుక్ లో వచ్చే నోటిఫికేషన్స్ ను తెరిచి చూశాడు.పెట్టుబడులు పెడితే అంతకుమించి ఆదాయం వస్తుందని ఒక యువతి ఫోన్ కాల్ లో చెప్పడంతో అతను నమ్మి  17 రోజుల్లోనే దాదాపు ఏకంగా 41 లక్షల రూపాయలను వారి అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేశారు.

అనంతరం అక్కడి నుండి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో బాధితుడు తాను మోసపోయానని గ్రహించి రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు సంప్రదించగా, సంఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టి మధ్యప్రదేశ్ కు చెందిన ఆదిత్య ను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.విచారణలో భాగంగా ఆన్లైన్ లో ఫారెక్స్‌ ట్రేడింగ్ అనే యాప్ ను చైనాకు చెందిన ఒక వ్యక్తి తో తయారు చేయించినట్లు నిందితుడు విచారణ భాగంలో తెలిపాడు.ఏది ఏమైనా కానీ.ఇలాంటివి  జరగకుండా తగిన జాగ్రత్తలు పాటించి డబ్బును పోగొట్టుకోకుండా జాగ్రత్తలు వహించాలని పోలీసులు ప్రజలను హెచ్చరిస్తున్నారు .

#Arrest #14 Lakhs #Trading App #Aditya Narayan #Fake App

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు