మంచు దుప్పట్లో అమెరికా..!!!  

చలికి అమెరికా గజగజలాడుతుంది. మిడ్‌వెస్ట్‌ ప్రాంతం పూర్తిగా హిమంతో కప్పబడిఉంది. దీంతో అక్కడ ఉఫ్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. కేవలం ఒక్క చికాగోలోనే -50 ఉష్ణోగ్రత రికార్డు అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. అయితే అంటార్కిటికా కన్నా చికాగోలోనే ఎక్కువ చలి నమోదు అయ్యిందని నిపుణుల అంచనా వేస్తున్నారు.

Winter Season In America Streets-

Winter Season In America Streets

మిచిగాన్‌, విస్కన్‌సిన్‌ నగరాల్లో ఒక మీటరు మేర మంచు పేరుకుపోయింది. జార్జియా, అలబామా, మసిసిపిలోనూ మైనస్‌ ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. కొన్ని ప్రదేశాల్లో మైనస్ 20 కన్నా తక్కువగా టెంపరేచర్లు నమోదు అవుతున్నాయి. మినపోలీస్‌లో మైనస్ 49 డిగ్రీలు నమోదు అయినట్లు తెలుస్తోంది.