చలికాలంలో బెల్లం టీ... తాగితే ఉపయోగాలేం"టీ"..?!

చాలా మందికి ఉదయం నిద్ర లేవగానే టీ గాని కాఫీ గాని తాగే అలవాటు ఉంటుంది.ఎప్పుడైనా బాగా ఒత్తిడికి లోనయినప్పుడు గాని, శరీరం అలసిపోయినప్పుడు, తలనొప్పిగా ఉన్నప్పుడు వేడి వేడి టీ గాని కాఫీ గాని తాగితే భలే రిలాక్స్ గా ఉంటుంది కదా.

 Winter, Jeggeey Tea , Latest Viral, Latest News, Health Care, Health Tips-TeluguStop.com

కొంతమంది అయితే రోజులో కనీసం నాలుగైదు సార్లు అయిన టీ తాగకుండా ఉండలేరు.అంతలా టీ కి అలవాటు పడిపోయిన వారు కూడా ఉన్నారంటే నమ్మశక్యంగా లేదు కదా.అయితే ఛాయ్ లో గాని కాఫీలో గాని పాలతో పాటు పంచదార కూడా వేస్తారు.ఇలా టీ లో షుగర్ వేయడం వల్ల శరీరానికి ఎక్కువ క్యాలరీలు అందుతాయి.

దీంతో బరువు అధికంగా పెరుగుతుంది.అందుకే టీలో చక్కెరకు బదులుగా బెల్లంను వేసుకుని తాగితే రుచి బాగుంటుంది.

 Winter, Jeggeey Tea , Latest Viral, Latest News, Health Care, Health Tips-చలికాలంలో బెల్లం టీ#8230; తాగితే ఉపయోగాలేంటీ..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అలాగే అధిక బరువు నుంచి తప్పించుకోవచ్చు.ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే టీ లో బెల్లం వేసుకుని తాగితే చాలారకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

Telugu Care, Tips, Jeggeey Tea, Latest-Telugu Health

ముఖ్యంగా ఈ శీతాకాలంలో చక్కెర వాడకాన్ని తగ్గించాలని నిపుణులు చెబుతున్నారు.దీని స్థానంలో బెల్లం వేసుకుని తాగితే ఈ కాలంలో వచ్చే వ్యాధులు, అనారోగ్యాలకు దూరంగా ఉండవచ్చు.మరి ఈ వింటర్ సీజన్లో బెల్లంతో తయారు చేసే టీని రోజూ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందామా.!

బెల్లంలో అనేక రకాలు అయిన పోషక పదార్ధాలు ఉంటాయి.

దీని వల్ల రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు వివిధ రకాల వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు రాకుండా చూసుకోవచ్చు.చలికాలంలో వచ్చే దగ్గు, జలుబును నివారించాలంటే రోజూ బెల్లం టీని తాగాలి.

బెల్లం టీలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి.

అలాగే నిత్యం మైగ్రేన్, దీర్ఘకాలిక తలనొప్పితో బాధపడేవారు ఆవు పాలలో బెల్లం కలిపి తాగితే సమస్య తగ్గుతుంది.

శీతాకాలంలో చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి బెల్లం టీని తాగితే చలి తీవ్రత తగ్గి శరీరం వెచ్చగా ఉంటుంది.ఎవరైతే మలబద్దకంతో బాధపడతారో వారికి బెల్లం టీ ఎంతో మేలు చేస్తుంది.

టీలో బెల్లంను చేర్చడం వల్ల జీర్ణ సమస్యలకు చెక్ పెట్టవచ్చు.జీర్ణ ప్రక్రియ వేగంగా జరుగుతుంది.

అలాగే బెల్లం వినియోగం వలన రక్తశాతం కూడా పెరుగుతుంది.

Telugu Care, Tips, Jeggeey Tea, Latest-Telugu Health

మరి ఇన్ని ఉపయోగాలు ఉన్న బెల్లం టీ ను ఎలా తయారుచేయాలో చూద్దామా.ముందుగా ఒక నాలుగు లవంగాలు, రెండు యాలకులు, ఒక ఇంచ్ దాల్చిన చెక్క,ఆర టీ స్పూన్ నల్ల మిరియాలను తీసుకుని లైట్ గా వేయించుకోవాలి.తరువాత మెత్తని పొడి చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకుని పెట్టుకోండి.

ఆ తరువాత స్టవ్ వెలిగించి ఒక పాత్ర పెట్టి అందులో ఒక గ్లాసు నీటిని పోయాలి.ఆ నీటిలో ముందుగా సిద్ధం చేసుకున్న పొడి వేసి బాగా మరిగించాలి.

అవి మరుగుతున్న సమయంలో కొద్దిగా బెల్లం పొడి కూడా వేయాలి.అలా 10 నిమిషాల పాటు సన్నని మంటపై మరిగించాలి.

గ్లాసు నీరు కాస్త సగం అవ్వాలి.ఆ తర్వాత స్టవ్ ఆపివేసి దించుకోవాలి.

అనంతరం వచ్చే టీని వడకట్టి గోరు వెచ్చగా ఉండగా తాగాలి.ఇలా ఈ బెల్లం టీ ని రోజూ తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube