పవన్ గెలుపుపై నీలినీడలు..?? ఓటమి ఖాయమా..??

నాకు కులం లేదు, మతం లేదు, ఓ వర్గం లేదు, నేను అందరి వాడిని అంటూ సినిమాడైలాగులు బాగానే వల్లెవేస్తూ ఉంటాడు.అసలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కులాల లెక్కలు వేయనివాడిలా ఫోజులు ఇవ్వడం చూస్తే రాజకీయాలు బాగానే వంటబట్టాయి అనుకుంటున్నారు పరిశీలకులు.

 Winning Chances Of Pawan In This Elections Are Less-TeluguStop.com

ఏపీలో ప్రధాన పార్టీలుగా ఉన్న టీడీపీ ,వైసీపీ అధినేతలు సైతం కులాల విషయం పదేపదే మాట్లాడరు.కానీ.

పవన్ కళ్యాణ్ తనకి కులాన్ని అంటగడుతున్నారు అనే వంకతో కులప్రస్తావన తీసుకువచ్చి షో చేస్తూ ఉంటారనేది కొంతమంది విమర్శకుల అభిప్రాయం.అయితే.

కులాల లెక్కలు వేయని వాడు, గాజువాక, భీమవరం రెండు స్థానాల నుంచీ ఎందుకు నిలబడినట్లు మరి ఇక్కడ పవన్ కుల సమీకరణాలని ఎందుకు బేరీజు వేసుకున్నట్ట్టు.కులాలకి అతీతుడిని అని చెప్పే పవన్ కళ్యాణ్, తనకి అభిమానులే కొండత అండ అని చెప్పే పవన్ కళ్యాణ్ ఈ రెండు నియోజకవర్గాలని ఎంచుకోవడం వెనుక పెద్ద స్కెచ్చే ఉందని అంటున్నారు.

ఆ వివరాలలోకి వెళ్తే.

గాజువాకలో కాపుల సంఖ్య అధికంగా ఉండటంతో పాటుగా, వైజాగ్ స్టీల్ ప్లాంట్ లోకి వలసలు వచ్చిన వారిలో అత్యధికులు కాపులే కావడం మరొక విశేషం.ఇక భీమవరంలో గెలుపు రావాలంటే కాపులు కొమ్ము కాయల్సిందే.ఈ కోణంలోనే పవన్ కళ్యాణ్ ఈ రెండు స్థానాలని ఎంచుకున్నారని తెలుస్తోంది.

అయితే ఉచిత సలహాలు ఇవ్వడంలో దిట్టగా పేరొందిన పవన్ కళ్యాణ్ రెండు రోజుల క్రితం కడప సీటు బీసీలకి ఇస్తారా అని ఛాలెంజ్ విసిరారు.

అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తానూ పోటీ చేసిన స్థానాలలో వేరే కులస్తులని పోటీ చేయించవచ్చు కదా లేకపోతే పవన్ కళ్యాణ్ కడప నుంచో తన అన్న ఓడిపోయినా పాలకొల్లు నుంచో పోటీ చేయవచ్చు కదా అనే ఆ ప్రశ్నలకి సమాధానాలు చెప్పలేని పరిస్థితి .అయితే ఇక్కడ మరొక విషయం ఏమిటంటే.పవన్ కళ్యాణ్ తాజాగా నిలబడిన స్థానాలలో గెలుపు అంత సులభం కాదని తెలుస్తోంది.

ముఖ్యంగా గాజువాకని తీసుకుంటే అక్కడ కాపులతో సమానంగా యాదవులు కూడా వున్నారు.టీడీపీ అభ్యర్ధి పల్లా శ్రీనివాస్ ఈ సామాజిక వర్గానికి చెందినవారే.

ఆయన తండ్రి సింహాచలం నుంచి నియోజకవర్గం మీద మంచి పట్టు వుంది.

అదే సమయంలో వైసీపీ అభ్యర్థి నాగిరెడ్డి బబీసీ వర్గానికి చెందినా వారే, అలాగే గాజువాక ప్రాంతంలో బీసీలు ,రెడ్ల సంఖ్య అధికంగా ఉండటంతో పాటు మిగిలిన కులాలు సైతం ఇప్పుడు జగన్ పంచన చేరటంతో గాజువాకలో పవన్ బొమ్మ కనిపించడం ఖాయం అంటున్నారు.అలాగే భీమవరంలో గెలుపు అవకాశాలు ఉన్నా వైసీపీకి కొమ్ము కాచే క్షత్రియ సామాజిక వర్గం గెలుపు ఓటములని ప్రభావితం చేయగలరు అనేది పక్కా దాంతో గెలుపుపై నీలినీడలు కమ్ముకున్నాయి అంటున్నారు విశ్లేషకులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube