సింగర్ గా మారిన వింక్ బ్యూటీ ప్రియా ప్రకాష్

ఒకే ఒక్క సినిమాతో అది కూడా ఒక సాంగ్ తో రాత్రికి రాత్రే సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోయిన అందాల భామ ప్రియా ప్రకాష్ వారియార్.ఈ గుర్తింపుతో అమ్మడు వరుసగా కమర్షియల్ యాడ్స్ చేసి రెండు చేతులా భాగానే సంపాదించింది.

 Wink Girl' Priya Prakash Varrier Turns Singer, Tollywood, South Heroines, South-TeluguStop.com

అయితే మొదటి సినిమాకి ఉన్న అగ్రిమెంట్ కారణంగా రెండో సినిమా చేయడానికి చాలా సమయం పట్టింది.ఈ సమయంలో ఈ బ్యూటీకి వచ్చిన గుర్తింపు కాస్తా మెల్లగా ఆవిరైంది.

రెండో సినిమా హిందీలో శ్రీదేవి బంగ్లా చేసిన అది విడుదలకి నోచుకోలేదు.దీంతో ఈ పాపకి అవకాశాలు రావడమే గగనం అయిపొయింది.

అయితే అదృష్టం కొద్ది తెలుగులో చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కిన చెక్ మూవీలో అమ్మడు ఆఫర్ సొంతం చేసుకుంది.ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.

ఇదిలా ఉంటే ఈ అమ్మడు మాతృ బాషలో చాలా గ్యాప్ తర్వాత మరో సినిమా చేస్తుంది.

Telugu Tollywood, Priyaprakash-Movie

ఇక తాజాగా ప్రియా ప్రకాష్ వారియర్ సింగర్ అవతారం ఎత్తినట్లు తెలుస్తుంది.టాలీవుడ్ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల రీసెంట్ గా ఒక ప్రైవేట్ ఆల్బమ్ తెరకెక్కించారు.ఈ ఆల్బమ్ సాంగ్ ని ప్రియా ప్రకాష్ వారియార్ పాడినట్లు తెలుస్తుంది.

మలయాళంలో తెరకెక్కుతున్న ఫైనల్ అనే సినిమాకి ఆమె పాటపాడింది.త్వరలో ఈ సాంగ్ డిజిటల్ ద్వారా ప్రేక్షకుల ముందుకి రాబోతుందని టాక్ వినిపిస్తుంది.

మరి వింక్ బ్యూటీగా మొదటి సినిమాతో సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన ఈ అమ్మడు ఇప్పుడు సింగర్ గా ఒక్క పాటతో ఫేమస్ అవుతుందో లేదో అనేది వేచి చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube