ఆల్బమ్ కోసం సింగర్ గా మారిన వింక్ బ్యూటీ  

Wink Beauty Turned As A Singer, Bollywood, Tollywood, Sridevi Bangla, Priya Prakash Worrier - Telugu Bollywood, Priya Prakash Worrier, Sridevi Bangla, Tollywood, Wink Beauty Turned As A Singer

సినిమాలో కన్ను గీటిన సన్నివేశంతో ఒక్కసారిగా రాత్రికి రాత్రే సోషల్ మీడియా సెన్సేషన్ గా మారిపోయిన బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్.ఈ అమ్మడు మలయాళీలో నటించిన ఒరు ఆదార్ లవ్ సినిమాలో చిన్న పాత్ర చేసింది.

TeluguStop.com - Wink Beauty Turned As A Singer

అయితే సినిమాలో ఆ పాత్ర నిడివి తక్కువే అయిన సోషల్ మీడియాలో ఆ సినిమా సాంగ్ టీజర్ లో కన్నుకొట్టి పాపులర్ అయిపొయింది.ఈ పాపులారిటీతో ఆమెకి విపరీతంగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఏర్పడటంతో అడ్వైర్టైజ్మెంట్ కంపెనీల నుంచి కూడా విపరీతంగా ఆఫర్స్ వచ్చాయి.

ఇక ఆమె స్టార్ హీరోయిన్ గా మారిపోవడం పక్కా అని అందరూ భావించారు.అయితే ప్రముఖ యాడ్స్ లో ఆమె కనిపించి సందడి చేశారు.

TeluguStop.com - ఆల్బమ్ కోసం సింగర్ గా మారిన వింక్ బ్యూటీ-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

అయితే ఆమె నటించిన సినిమా రిలీజ్ అయిన తర్వాత రేంజ్ ఒక్కసారిగా పడిపోయింది.సినిమా డిజాస్టర్ కావడంతో ప్రియా ప్రకాష్ ని ఎవరూ పట్టించు కోలేదు.

అయితే శ్రీదేవి బంగ్లా అని ఓ హిందీ సినిమాలో అవకాశం వచ్చింది.ఆ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న రిలీజ్ కి నోచుకోలేచు.

నితిన్, చంద్రశేఖర్ ఏలేటి మూవీలో ప్రియాకి అవకాశం వచ్చినా అది ఎప్పుడు మొదలవుతుందో తెలియని పరిస్థితి నెలకొని ఉంది.

ఇదిలా ఉంటే తాజాగా ఓ తమిళ సినిమాలో ప్రియా ప్రకాష్ కి అవకాశం వచ్చింది.

ఇక నటిగా సక్సెస్ కావడానికి ఆపసోపాలు పడుతున్న ప్రియా ప్రకాష్ లో మరో హిడెన్ టాలెంట్ దాగి ఉందని తాజాగా బయట పెట్టింది.తనలోని గాయనిని ఆమె పరిచయం చేసింది.

ఓ హిందీ మ్యూజిక్‌ వీడియోలో నటించి, ఆ పాటను ఆలపించింది. అశోకన్‌ పి దర్శకత్వం వహించిన ఈ మ్యూజిక్‌ వీడియో త్వరలోనే విడుదల కానుంది.

ఈ పాట టీజర్‌ను మంగళవారం విడుదల చేశారు.క్రిస్టస్‌ స్టీఫెన్‌ సంగీతం అందించారు.

కరోనా నేపధ్యంలో అన్ని జాగ్రత్తలు పాటిస్తూనే ఈ మ్యూజిక్‌ వీడియోను షూట్‌ చేశామని టీమ్‌ పేర్కొంది.మరి గాయనిగా తన అదృష్టం పరీక్షించుకున్న ప్రియా ప్రకాష్ ని ఈ విధంగా అయినా ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారేమో వేచి చూడాలి.

#PriyaPrakash #WinkBeauty #Sridevi Bangla

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Wink Beauty Turned As A Singer Related Telugu News,Photos/Pics,Images..