ధృవ్ విక్రమ్ కి జోడీగా ఛాన్స్ కొట్టేసిన వింక్ బ్యూటీ

ఒకే ఒక్క సినిమాతో ఇండియన్ వైడ్ గా ఫాన్స్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న వింక్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్. ఈ అమ్మడు మొదటి సినిమాలో చేసింది చిన్న పాత్ర అయిన ఒకే ఒక్క సాంగ్ లో కన్ను కొట్టిన వీడియోతో సోషల్ మీడియాలో సెన్సేషన్ అయిపోతుంది.

 Wink Beauty Romance With Dhruv Vikram, Tollywod, Ishq Movie, Teja Sajja, Kollywo-TeluguStop.com

తరువాత కమర్షియల్ యాడ్స్ తో భాగా పాపులర్ అయ్యింది.అయితే మొదటి సినిమా ఆమెకి ఏ విధంగా కూడా నటిగా ఇమేజ్ తీసుకురాలేదు.

అయితే రెండో సినిమా అవకాశాన్ని ఏకంగా హిందీలో దక్కించుకుంది.శ్రీదేవి బంగ్లా పేరుతో ఈ సినిమా తెరకెక్కింది.

అయితే ఈ సినిమా రిలీజ్ కి నోచుకోలేదు.అయితే ఊహించని విధంగా తెలుగులో నితిన్ కి జోడీగా చెక్ సినిమాలో నటించింది.

ఈ మూవీ కూడా డిజాస్టర్ అయ్యింది.ప్రస్తుతం కుర్ర హీరో తేజ సజ్జాకి జోడీగా ఇష్క్ అనే సినిమాలో నటించింది.రొమాంటిక్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ కి రెడీ అయిన కూడా కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది.మరో రెండు తెలుగు సినిమాలని ఈ అమ్మడు ఇప్పటికే ఒకే చెప్పినట్లు తెలుస్తుంది.

ఇదిలా ఉంటే ఇప్పుడు కోలీవుడ్ లో ఎంట్రీకి ఈ బ్యూటీ అదిరిపోయే అవకాశాన్ని సొంతం చేసుకుంది.చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ కి జోడీగా ప్రియా ప్రకాష్ వారియర్ ఎంపిక అయ్యింది.

అర్జున్ రెడ్డి రీమేక్ ఆదిత్య వర్మతో హీరోగా పరిచయం అయిన ధృవ్ విక్రమ్ ప్రస్తుతం తండ్రితో ఒక సినిమా చేస్తున్నాడు.దీని తర్వాత మురుగదాస్ శిష్యుడు రవికాంత్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి ఒకే చెప్పాడు.

ఈ సినిమా వింక్ బ్యూటీ హీరోయిన్ గా అవకాశం పట్టేసింది.రీసెంట్ గా ఈ అమ్మడుకి టెస్ట్ షూట్ కూడా నిర్వహించారని తెలుస్తుంది.

త్వరలో ఈ సినిమాకి సంబంధించి పూర్తి వివరాలు అఫీషియల్ గా ఎనౌన్స్ చేసే అవకాశం ఉందని బోగట్టా.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube