రెండు ఫ్లాప్ లకి ఫిలాసఫీ చెబుతున్న వింక్ బ్యూటీ

రాత్రికి రాత్రే సోషల్ మీడియాలో పాపులారిటీ సొంతం చేసుకున్న వింక్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్ గా ఎదగడానికి టాలీవుడ్ లో తన ప్రయత్నాలని విస్తృతం చేసింది.చెక్ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు ప్రస్తుతం ఇష్క్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీ అవుతుంది.

 Wink Beauty Priya Prakash Varrier Philosophy, Tollywood, Telugu Cinema, Ishq Mov-TeluguStop.com

ఈ సినిమా ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.మలయాళీ రీమేక్ గా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తున్నారు.

ఇందులో ప్రియా ప్రకాష్ వారియర్ కి జోడీగా తేజ సజ్జా నటిస్తున్నాడు.ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రమోషన్ ఈవెంట్ లో భాగంగా ప్రియా ప్రకాష్ ఆసక్తికర వాఖ్యలు చేసింది.

ఈమె నటించిన మొదటి సినిమా ఒరు ఆదార్ లవ్, తెలుగులో చేసిన మొదటి సినిమా చెక్.ఈ రెండు సినిమాలు డిజాస్టర్ కావడంతో పాటు ఈమె పాత్రలకి కూడా పెద్దగా గుర్తింపు రాలేదు.

ఏదో నామమాత్రంగా అలా వచ్చిపోయే పాత్రలనే చేసింది అనే టాక్ ఉంది.

ఈ నేపధ్యంలో ఆమె చేసిన వాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

మనం నటించిన అన్ని సినిమాలు హిట్ కావు.అలా అని నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు.

ఫెయిల్యూర్ నుంచి చాలా విషయాలు నేర్చుకోవచ్చు.నా గత సినిమాలలో నేను చేసిన పాత్రలు చిన్నవే అయినా చాలా ప్రత్యేకంగా అనిపించాయి.

అందుకే ఇష్టపడి నటించా.సినిమా పెయిల్ అయినంత మాత్రాన ఓడిపోయినట్లు కాదు.

సినిమాలో మన పాత్రకి ఎంత వరకు న్యాయం చేశామనే దానిపై మన సాటిష్ఫెక్షన్ ఉంటుందని ప్రియా చెప్పడం విశేషం.మొత్తానికి రెండు సినిమాలు ఫ్లాప్ అయిన ఈ అమ్మడు ఫిలాసఫీ మాత్రం చాలా మందికి స్ఫూర్తినిచ్చే విధంగా ఉందనే మాట ఇప్పుడు వినిపిస్తుంది.

ఇదిలా ఉంటే ఇష్క్ సినిమా తర్వాత సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో కూడా ఈ అమ్మడు హీరోయిన్ నటిస్తూ ఉండటం విశేషం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube