తేజ సజ్జాతో జత కడుతున్న వింక్ బ్యూటీ

చైల్డ్ ఆర్టిస్ట్ తేజా సజ్జా ప్రస్తుతం హీరోగా ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు.ఓ బేబీ సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన తేజ సజ్జా హీరోగా ఆకాశవాణి అనే సినిమాకి ముందుగా ఒకే చెప్పాడు.

 Wink Beauty Priya Prakash Romance With Teja Sajja, Tollywood, Mega Super Good Fi-TeluguStop.com

అయితే ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో జాంబీరెడ్డి సినిమా ఫస్ట్ స్టార్ట్ అయ్యి రిలీజ్ కి రెడీ అవుతుంది.ఈ సినిమా ట్రైలర్ తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చింది.

ఇందులో జాంబియన్స్ తో పోరాడే హీరోగా తేజ సజ్జా తన పవర్ ని చూపించడానికి రెడీ అవుతున్నాడు.సోషియో ఫాంటసీ కథాంశంతో మరో సినిమా కూడా అతను హీరోగా రెడీ అవుతుంది.

ఇదిలా ఉంటే ఇప్పుడు మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ లో ఓ కొత్త సినిమాకి తేజ ఒకే చెప్పాడు.చాలా గ్యాప్ తర్వాత ఈ ప్రొడక్షన్ హౌస్ తెలుగులో సినిమా చేస్తుంది.

ఇష్క్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.

గతంలో నితిన్ ఇష్క్ టైటిల్ తో సూపర్ హిట్ కొట్టి కెరియర్ లో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యాడు.

ఇప్పుడు అదే టైటిల్ తో మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ తేజతో సినిమాని తెరకెక్కిస్తోంది.ఈ సినిమా టైటిల్ పోస్టర్ ని కూడా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

ఇక ఈ సినిమాకి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు.ఈ సినిమాలో తేజతో వింక్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ రొమాన్స్ చేయబోతుంది.

చెక్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రియా ప్రకాష్ ఇప్పుడు రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నటించడం ద్వారా మంచి ఛాన్స్ ని అందుకుందని చెప్పాలి.ఇందులో అమ్మడు తన లుక్స్ తో మెస్మరైజ్ చేస్తే టాలీవుడ్ లో రూల్ చేయడం గ్యారెంటీ అనే మాట వినిపిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube