సత్యదేవ్ తో జత కట్టబోతున్న వింక్ బ్యూటీ

వింక్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ టాలీవుడ్ లో ప్రస్తుతం బిజీ అయ్యే పనిలో ఉంది.ఈ అమ్మడు వరుస ప్రాజెక్ట్ లకి గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది.

 Wink Beauty Priya Prakash Romance With Satyadev, Timmarusu Movie, South Heroines-TeluguStop.com

నితిన్ కి జోడీగా ఈ అమ్మడు తెలుగులోకి ఎంట్రీ ఇస్తుంది.ఈమె చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ఈమె నటించిన చెక్ మూవీ మరో రెండు రోజులలో రిలీజ్ కాబోతుంది.

ఇప్పటికే పాజిటివ్ టాక్ తో నడుస్తున్న ఈ సినిమాతో సక్సెస్ వస్తుందనే గట్టి నమ్మకంతో ఈ మలయాళీ సుందరి ఉంది.దీని తర్వాత తేజా సజ్జాతో రొమాంటిక్ లవ్ స్టొరీ చేస్తుంది.

అది కూడా మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ లాంటి పెద్ద బ్యానర్ లో ఈ సినిమా మీద కూడా మంచి పాజిటివ్ బజ్ ఉంది.అయితే ఇప్పుడు మరో సినిమాకి కూడా ఈ హాట్ బ్యూటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న టాలెంటెడ్ హీరో సత్యదేవ్ ప్రస్తుతం తిమ్మరుసు అనే సినిమాలో నటిస్తున్నాడు.ఈ సినిమాలో అతను లాయర్ పాత్రలో కనిపించబోతున్నాడు.

న్యాయం కోసం పోరాడే యువ లాయర్ గా అతని పాత్ర ఉంటుంది.చట్టం, న్యాయవ్యవస్థలో ఉన్న లోపాలని ఈ సినిమాలో ఎత్తి చూపించబోతున్నట్లు తెలుస్తుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ ఇప్పుడు ప్రియా ప్రకాష్ వారియర్ ని ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది.ఆమె పాత్రకి సినిమాలో చాలా ప్రాధాన్యత ఉంటుందని టాక్ నడుస్తుంది.

తెలుగులో ఇది మల్లు బ్యూటీకి మూడో సినిమా కావడం విశేషం.అయితే ఈ బ్యూటీ స్పీడ్ చూస్తూ ఉంటే ఈ సినిమాలు పూర్తి కాకుండానే స్టార్ హీరోయిన్ కేటగిరీలోకి వెళ్ళిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదని మాట్లాడుకుంటున్నారు.

ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి తర్వాత వింక్ బ్యూటీ ప్రియా ప్రకాష్ గురించి ఇప్పుడు టాలీవుడ్ లో ఎక్కువ చర్చ నడుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube