బ్రేకింగ్ న్యూస్: అభినందన్ ని రేపు రిలీజ్ చేస్తున్న పాక్!

భారత్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ ఫైలట్ ని రిలీజ్ చేయడానికి పాకిస్తాన్ ప్రభుత్వం చివరికి ఒప్పుకుంది.దౌత్యపరంగా పాకిస్తాన్ పై భారత్ తీసుకొచ్చిన ఒత్తిడితో ప్రపంచ దేశాలు పాకిస్తాన్ కి నేరుగా వార్నింగ్ ఇచ్చాయి.

 Wing Commander Abhinandan Release Tomorrow-TeluguStop.com

వెంటనే కవ్వింపు చర్యలు ఆపేసి భారత్ కి సహకరించాలని ఆదేశించాయి.ఒక వేళ మాట వినకుంటే పరిణామాలు తరువాత తీవ్రంగా ఉంటాయని కూడా ఐక్యరాజ్యసమితిలో శాశ్వత సభ్యదేశాలు హెచ్చరించాయి.

దీంతో పాకిస్తాన్ మొండి వైఖరిని వదిలి దిగిరాక తప్పలేదు.

పాకిస్తాన్ తన ఆధీనంలో వున్న సైనికుడు అభినందన్ ని అడ్డుపెట్టుకొని భారత్ ని ఇరుకున పెట్టాలని చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో చివరికి అతనిని రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించింది.

శాంతియుత వాతావరణం నెలకొల్పడానికి వీలుగా తమ ఆధీనంలో వున్నా భారత కమాండర్ అభినదన్ ని అప్పగిస్తున్నట్లు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తాజాగా ప్రకటించాడు.అతనిని రేపు భారత్ కి అప్పగిస్తామని ఇమ్రాన్ ఖాన్ తన సందేశంలో చెప్పాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube