విడ్డూరం : పాకిస్థాన్‌ టీ పౌడర్‌కు అభినందన్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌  

Wing Commander Abhinandan Features In Pakistani Tea Advertisement-

పాకిస్థాన్‌ వారికి ఇండియన్‌ వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ అంటే పీకల వరకు కోపం ఉండి ఉంటుంది.ఎందుకంటే పాకిస్థాన్‌కు చెందిన యుద్ద విమానంను కూల్చి వేయడంతో పాటు, ఆ దేశ గడ్డపై హిందుస్థాన్‌ జిందాబాద్‌ అంటూ నినదించాడు.దాంతో స్థానిక మూకలు అభినందన్‌పై దాడి చేసిన విషయం కూడా తెల్సిందే...

Wing Commander Abhinandan Features In Pakistani Tea Advertisement--Wing Commander Abhinandan Features In Pakistani Tea Advertisement-

ఆర్మీ వారు కూడా అభినందన్‌ను అంత సులభంగా వదిలేవారు కాదు.కాని ఇండియా జెనీవా ఒప్పందం అంటూ అంతర్జాతీయ స్థాయిలో పాకిస్థాన్‌పై ఒత్తిడి తీసుకు వచ్చిన నేపథ్యంలో వెనక్కు తగ్గడం జరిగింది.

పాకిస్థాన్‌కు చెందిన ఎంతో మంది అక్కడి సుప్రీం కోర్టులో అభినందన్‌ను విడుదల చేయవద్దంటూ కేసులు పెట్టారు.

Wing Commander Abhinandan Features In Pakistani Tea Advertisement--Wing Commander Abhinandan Features In Pakistani Tea Advertisement-

అలాంటి నేపథ్యంలో పాకిస్థాన్‌కు చెందిన ఒక టీకి అభినందన్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌ అంటూ ప్రచారం జరుగుతుంది.పాకిస్థాన్‌ కరాచీకి చెందిన తపాల్‌ టీ కంపెనీ వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ హల్‌ చల్‌ చేస్తోంది.ఇండియాతో పాటు పాకిస్థాన్‌లో కూడా ఆ వీడియో వైరల్‌ అయ్యింది.

ఆ వీడియోలో అభినందన్‌ టీ తాగుతున్న విజువల్స్‌ ఉన్నాయి.

అభినందన్‌ తపాల్‌ టీ తాగుతున్నాడు.ఆయన తపాల్‌ టీకి ఇంప్రెస్‌ అయ్యాడు అంటూ తపాల్‌ టీ కంపెనీ యాడ్‌లో చూపించడం జరిగింది.ఈ వీడియోను తపాల్‌ టీ కంపెనీ వారు తయారు చేశారా లేదంటే మరెవ్వరైనా ఈ వీడియోను పెట్టారా అనేది తెలియడం లేదు.

తపాల్‌ టీ కంపెనీపై అక్కడ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.అయితే ఒక్కసారిగా తపాల్‌ టీ కంపెనీ గురించి అందరికి తెలిసిందని, దాంతో సేల్స్‌ కూడా బాగా పెరిగాయంటూ కొందరు అంటున్నారు...

మొత్తానికి ఒక పాకిస్థానీ టీ కంపెనీకి కూడా అభినందన్‌ ఈరకంగా ఉపయోగపడ్డాడు, రియల్‌ హీరో అభినందన్‌ అంటూ సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ వస్తున్నాయి.పాకిస్థాన్‌ ఆర్మీ వారు అభినందన్‌కు టీ ఇచ్చి కొన్ని ప్రశ్నలు అడిగిన వీడియో ఆమద్య బాగా వైరల్‌ అయ్యింది.

అందులో ఆర్మీ వారు ఇచ్చిన టీకి తాను ఇంప్రెస్‌ అయినట్లుగా అభినందన్‌ చెప్పాడు.ఆ వీడియోని ఎడిట్‌ చేసి తపాల్‌ టీ కంపెనీ యాడ్‌గా మార్చేశారు.క్రియేటివిటీ పీక్స్‌కు చేరడం అంటే ఇదే కదా…!