కరువున పడి ఉన్నారు, ఒక్కరోజే ఎన్ని కోట్ల మందు తాగారో తెలుసా?

కరోనా కారణంగా దేశంలో 45 రోజులుగా మద్యం షాప్స్‌ పూర్తిగా బంద్‌ ఉన్న విషయం తెల్సిందే.అనుకోని పరిణామంగా మద్యం షాపులు క్లోజ్‌ చేయడంతో తాగుబోతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

 Latest Update Of Profits About Wine Shops Open One Day Sale, Corona Virus, India-TeluguStop.com

కొందరు మద్యం లేక ఆత్మహత్య చేసుకోగా, కొందరు అనారోగ్యంతో మృతి చెందారు.మరికొందరు మాత్రం మానసిక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

మొత్తానికి మద్యంలేక ఎన్నో ఇబ్బందులు పడ్డ వారికి ఎట్టకేలకు ఉపశమనం లభించింది.

మూడవ దశ లాక్‌డౌన్‌ అమలులో ఉన్నా కూడా మద్యం షాప్స్‌ను ఓపెన్‌ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

అందుకే దేశంలో చాలా రాష్ట్రాల్లో వైన్స్‌ ఓపెన్‌ అయ్యాయి.నిన్న ఒక్క రోజే సాదారణం కంటే రెట్టింపు వైన్స్‌ అమ్మకాలు జరిగినట్లుగా తెలుస్తోంది.ఉత్తర ప్రదేశ్‌లో వంద కోట్ల మద్యం అమ్మకాలు జరుగగా ఏపీలో 65 కోట్ల వరకు అమ్మకాలు జరిగినట్లుగా చెబుతున్నారు.ఇక ఇతర ప్రాంతాల్లో కూడా భారీ ఎత్తున మద్యం అమ్మకాలు జరిగాయి.

కనుక నిన్న ఒక్కరోజే దేశంలో వెయ్యి కోట్ల వరకు మద్యం అమ్మకాలు జరిగినట్లుగా తెలుస్తోంది.కరువున పడి ఉన్న జనాలు ఇంతకు ముందు కంటే దాదాపుగా రెట్టింపు మద్యంను లాగించేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube