మందు బాబులకు బీజేపీ 'ఆఫర్' ! తూచ్ మీరే చదువుకోండి !  

Wine Shops Colesd On Holidays Bjp Election Promice-

తెలంగాణాలో అధికారంలోకి రావాలని ఆశపడుతున్న బీజేపీ విపక్షాలకు ధీటుగా తమ ఎన్నికల మ్యానిఫెస్టో ప్రకటించింది. బీజేపీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌ ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్‌ ఆ వివరాలను శనివారం వెల్లడించారు. అయితే ఆ మ్యానిఫెస్టో లో ఉన్న మిగతా వివరాల సంగతి పక్కనపెడితే … మందుబాబులకు మాత్రం ఆ పార్టీ చేదు వార్త చెప్పింది..

మందు బాబులకు బీజేపీ 'ఆఫర్' ! తూచ్ మీరే చదువుకోండి ! -Wine Shops Colesd On Holidays Bjp Election Promice

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే మద్యం అమ్మకాలకు వారంలో 5 రోజులే అనుమతిస్తామని, రోజూ సాయంత్రం 6 గంటలకే విక్రయాలను నిలిపివేయిస్తామని బీజేపీ ప్రకటించింది. దీనిపై మందుబాబులు మండిపడుతున్నారు.

సెలవు రోజుల్లో మాకు మందు తాగే సౌకర్యం లేకపోతే ఎలా మాకు ఆ సరదా దూరం చేస్తారా అంటూ వ్యంగ్యంగా సోషల్ మీడియాలో ఛలోక్తులు విసురుతున్నారు.