సరికొత్త ఫీచర్లతో విడుదలైన విండోస్ 11..!

విండోస్‌ 11ను మైక్రోసాఫ్ట్ తాజాగా విడుదల చేసింది.మైక్రోసాఫ్ట్ విండోస్ 10 ఓఎస్‌ను విడుదల చేసిన ఆరేళ్ళ తర్వాత విండోస్‌ 11 ఓఎస్‌ను విడుదల చేయడం విశేషం అనే చెప్పాలి.

 Windows 11 Released With The Latest Features .  Windows11, Micro Soft, New Featu-TeluguStop.com

విండోస్ కొత్త థీమ్స్, ఐకాన్స్‌ తోపాటు యూఐలో పలు మార్పులతో మన ముందుకు వచ్చింది అయితే విండోస్ 10 యూజర్లంతా కొత్త విండోస్ 11 కు ఉచితంగా అప్‌ గ్రేడ్‌ కావొచ్చని మైక్రోసాఫ్ట్ తెలిపింది.మరి విండోస్ 11 లో ఉన్న అదిరిపోయే ఫీచర్లను ఇప్పుడు చూద్దాం.

విండోస్ 11 సరికొత్త డిజైన్‌ తో రానుంది.స్టార్టప్ మెనూను మధ్య భాగంలో అందించారు.

అయితే ఈ మార్పు నచ్చని వారు సెట్టింగ్స్‌ లో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా పాత పద్ధతిలోనే స్టార్టప్ మెనూను తమకు నచ్చినట్లు ఎడమవైపు మార్చుకోవచ్చు.కొత్త ఓఎస్‌ లో టాస్క్‌ బార్‌ లో చాట్ చేసే సౌకర్యాన్ని అందించాయి.

దీంతో యూజర్లు టెక్స్ట్, వాయిస్, వీడియో కాల్స్‌ చేసుకోవచ్చని తెలిపింది.విండోస్ 11 గేమ్స్ ఆడుకునే వారికి బాగా ఉపయోగపడుతుందిని మైక్రోసాఫ్ట్ తెలిపింది.ఆటో హెచ్‌డీఆర్ సపోర్ట్, డైరెక్ట్ ఎక్స్ 12 అల్టిమేట్, ఎక్స్‌క్లౌడ్ ఇంటిగ్రేషన్‌లతో విండోస్‌ 11 రానుంది.క్లౌడ్ గేమింగ్, ఎక్స్‌బాక్స్ గేమ్ పాస్ యాక్సెస్‌ ను ఎక్స్‌ క్లౌడ్ ఇంటిగ్రేషన్ ద్వారా పొందవచ్చు.

ఇంకా న్యూస్ విండోతో యూజర్లకు తాజా వార్తలు, వాతావరణ అప్‌డేట్‌లతోపాటు మరెన్నో నోటిఫికేషన్‌ లు అందిస్తుంది.కొత్త థీమ్స్, కొత్త వాల్ పేపర్స్, మెరుగైన డార్క్‌ మోడ్‌ ను అందించారు.

Telugu Latest, Micro Soft, Windows-Latest News - Telugu

విండోస్ 11లో మెరుగైన టచ్ కీబోర్డు కూడా ఉంది.జిఫ్ ఫీచర్‌ తోపాటు వాయిస్ డిక్టేషన్, వాయిస్ కమాండ్స్ కూడా ఇందులో అందించారు.ఇందులో టచ్ స్క్రీన్ ఎక్స్‌పీరియన్స్‌ ను యాడ్ చేశారు.టీమ్స్ వీడియో కాన్ఫరెన్సింగ్ సేవలతో పాటు ఇందులో మ్యూట్ అండ్ అన్‌మ్యూట్ ఫీచర్లను యాడ్ చేశారు.ఎడ్జ్ బ్రౌజర్‌ లోనూ పలుమార్పులు చేశారు.ఇది జులై 28 నుంచి ప్రారంభం కానుంది.

ఆండ్రాయిడ్ యాప్స్ ను విండోస్ 11 లో అందించనున్నారు.ఇందుకోసం అమెజాన్ యాప్ స్టోర్‌ ను ఇన్‌బిల్ట్‌ గా అందించారు.

ఇందుకోసం ఇంటెల్ బ్రిడ్జ్ టెక్నాలజీని వాడినట్లు తెలిపింది.విండోస్ 11 అందుబాటులోకి ఎప్పుడు వస్తుందంటే విండోస్ 11 వచ్చే వారం నుంచి విండోస్ ఇన్సైడర్ సభ్యులకు అందుబాటులో ఉండనుంది.

ఈ ఏడాది చివర్లో విండోస్ 10 యూజర్లు ఉచితంగా అప్‌ గ్రేడ్‌ చేసుకోవచ్చంట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube