భారత్‌పై 8 వికెట్ల తేడాతో విండీస్ గెలుపు  

Windies Won First Odi Against India-first Odi,india,wi,windies

భారత్ పర్యటనలో భాగంగా వెస్టీండస్‌తో జరిగిన తొలి వన్డేలో భారత్ పేలవమైన ఆటతీరును ప్రదర్శించింది.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 287 పరుగులు చేసింది.

Windies Won First Odi Against India-first Odi,india,wi,windies -Windies Won First ODI Against India-First Odi India Wi

భారత బ్యాట్స్‌మెన్‌లలో ఓపెనర్‌లు కేఎల్ రాహుల్(6), కెప్టెన్ విరాట్ కోహ్లీ(4) స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరారు.

అటుపై రోహిత్ శర్మ(36) పరుగులతో పర్వాలేదనిపించగా, యువ బ్యాట్స్‌మెన్‌ శ్రేయస్ అయ్యర్(70), రిషబ్ పంత్(71) పరుగులు చేసి జట్టు స్కోరును పరిగెత్తించారు.

వీరిద్దరు ఔట్ అయ్యాక వచ్చిన కేదార్ జాదవ్(40), రవీంద్ర జడేజా(21) కూడా భారత్ స్కోరును ముందుకు తీసుకెళ్లడంతో 50 ఓవర్లలో 287 పరుగులు చేసింది.అటుపై లక్ష్యఛేదనకు దిగిన విండీస్ బ్యాట్స్‌మెన్‌లు రాణించడంతో కేవలం 47.5 ఓవర్లలో విజయపతాకం ఎగురవేసింది.

విండీస్ బ్యాట్స్‌మెన్‌లలో ఓపెనర్‌ ఆంబ్రిస్(9) పరుగులకే ఔట్ కావడంతో మరో ఓపెనర్ హోప్(102), హెట్మెయిర్(139) శతకాలతో రాణించడంతో జట్టుకు విజయాన్ని అందించారు.

భారత బౌలర్లు చేతులెత్తేయడంతో 3 వన్డేల సిరీస్‌లో 1-0 విండీస్ జట్టు ఆధిక్యాన్ని సాధించింది.

తాజా వార్తలు