రంజాన్ ఉపవాసం పాటిస్తూ స్ఫూర్తిగా నిల్చిన విలియంసన్, డేవిడ్ భాయ్..!

మన భారతదేశంలో ఎంతోమంది ప్రజలు ఎన్నో ఆచారాలను పాటిస్తుంటారు.కొందరు హిందువులు ముస్లిం ఆచారాలు పాటిస్తే.

 Williamson, David Bhai Inspired By Fasting Ramadan, Srh, Ipl, Ipl 2021, Dawid Wa-TeluguStop.com

కొందరు ముస్లింలు హిందువుల ఆచారాలు పాటిస్తూ హిందువుల పండుగలు కూడా చేసుకుంటారు.ఈ రెండు మతాలకు చెందిన వారు మాత్రమే కాదు మిగతా మతాలకు చెందిన వారు కూడా ఇతర మతాల ఆచారాలను ఎంతో గౌరవిస్తారు.

మన భారత దేశంలో ఎక్కడ చూసినా భిన్నత్వంలో ఏకత్వం, పరమతసహనం కనిపిస్తుంది.అయితే ఇతర దేశాల నుంచి వచ్చిన వారు కూడా మన దేశ ప్రజల ఐక్యమత్యం చూసి ముచ్చట పడుతుంటారు.

భారతదేశం లో అడుగు పెట్టిన తర్వాత కొందరు విదేశీయులు ఇతర మతాల ఆచారాలను ఎలా గౌరవించాలో కూడా నేర్చుకుంటారు.అంతటి మహోన్నత మన భారతదేశం లో నెలకొందని నిస్సందేహం గా చెప్పుకోవచ్చు.

అయితే భారతదేశంలో అడుగుపెట్టిన వేళా విశేషమో ఏమో గాని హైదరాబాద్ సన్‌రైజర్స్ టీమ్ తరఫున ఆడుతున్న కేన్ విలియమ్‌సన్, డేవిడ్ వార్నర్ కూడా మొదటిసారి రంజాన్ ఉపవాసం పాటించి మతాలు వేరైనా, కులాలు వేరైనా, దేశాలు వేరైనా మనమంతా ఒక్కటేనని చెప్పకనే చెబుతూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు.అయితే.

కేన్ విలియమ్‌సన్, డేవిడ్ వార్నర్ రంజాన్ ఉపవాసం పూర్తి చేసినట్టు సన్‌రైజర్స్ జట్టుకు చెందిన ఆటగాడు రషీద్ ఖాన్ ఒక వీడియో విడుదల చేసి వెల్లడించారు.ఈ వీడియోలో.‘ఇవాళ ఉపవాసం ఎలా ఉంది?’ అని రషీద్ ప్రశ్నించగా.బాగుందని వార్నర్ జవాబిచ్చారు.

ఈ వీడియోలో రెస్టారెంట్ లో కూర్చున్నట్టు కనిపించిన డేవిడ్ వార్నర్ తనకు బాగా ఆకలి వేస్తోందని.బాగా దాహంగా కూడా ఉందని చెప్పగా.

కేన్ కూడా తనకు ఆకలిగా ఉందని చెప్పుకొచ్చారు.ఈ వీడియోలో వీళ్లిద్దరు నీరసంగా కనిపించడం కూడా మనం చూడొచ్చు.

ఐతే ప్రస్తుతం రంజాన్ మాసం కావడంతో హైదరాబాద్ జట్టులోని రషీద్ ఖాన్, ముజీబ్ రహ్మాన్, మహ్మద్ నబీ, ఖలీల్ అహ్మద్ ఉపవాసం పాటిస్తుండగా.వార్నర్, విలియమ్‌సన్ కూడా ఉపవాస దీక్షను పాటించి అందరినీ ఫిదా చేశారు.

అయితే ప్రస్తుతం రషీద్ ఖాన్ షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube