టీడీపీలో ఆ మైన‌స్ పాయింట్ ను వైసీపీ వాడుకోనుందా..?

తెలుగు దేశం పార్టీకి ఒక ఘ‌న‌మైన చ‌రిత్ర ఉంది.ఈ పార్టీ నుంచే ఎంతోమంది మ‌హామ‌హులు పుట్టుకొచ్చారు.

 Will Ycp Use That Minus Point In Tdp Details, Tdp, Ycp , Chandrababu Naidu, Jaga-TeluguStop.com

ఉమ్మ‌డి రాష్ట్రంలో ఎంతోమంది గుర్తింపు ఉన్న నాయ‌కులు టీడీపీ నుంచే వ‌చ్చారు.అంతెందుకు ఇప్పుడు తెలంగాణ‌లో కేసీఆర్‌, రేవంత్‌, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్, ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు లాంటి వారంతా కూడా టీడీపీ నుంచి వ‌చ్చిన వారే.

అలా ఎంతోమంది బ‌లమైన నేత‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్ అయిన‌టువంటి టీడీపీ ప‌రిస్థితి ఇప్పుడు ఏపీలో ఎంత దారుణంగా ఉందో చూస్తూనే ఉన్నాం.క‌నీసం ఉనికి చాటుకోలేని ప‌రిస్థితిలో ప‌డిపోయింది.

దీనికి కొన్ని కార‌ణాలు కూడా ఉన్నాయి.అదేంటంటే టీడీపీలో చంద్ర‌బాబు త‌ప్ప ఆయ‌న త‌ర్వాత అంత స్థాయిలో పార్టీని న‌డిపించే వారు లేక‌పోడం.ఆయ‌న కొడుకు లోకేష్ గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన త‌ర్వాత ఆయ‌న‌మీద న‌మ్మ‌కం పోయింది.పైగా ఆయ‌న ఇంకా తండ్రి చాటు బిడ్డ‌గానే ఉన్నారు త‌ప్ప త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు అంటూ ఏమీ లేదు.

ఇలాంటి ప‌రిస్థితుల్లో జ‌గ‌న్ లాంటి యువ‌నేత బ‌లంగా ఎదిగిపోవ‌డంతో ఆయ‌న్ను ఎదుర్కోవ‌డం అంటే చంద్రబాబుకు పెద్ద స‌వాలే అని చెప్పాలి.పైగా ఆయ‌న‌కు ఇప్పుడు ఏజ్ కూడా మీద ప‌డుతోంది.

Telugu Ap, Chandrababu, Errabelli, Lokesh, Revanth Reddy, Tdp-Telugu Political N

వీటినే వైపీపీ ఆస‌రాగాచేసుకుంటోంది.ఎలాగూ చంద్ర‌బాబు త‌ప్ప టీడీపీని న‌డిపించేవారు ఆ పార్టీకి లేరు.దీంతో వైసీపీ పార్టీ ఈ మైన‌స్ పాయింట్ నే ఆస‌రాగా చేసుకుని దూసుకు పోవాల‌ని చూస్తోంది.ఒక వేళ చంద్ర‌బాబుని నమ్మి ఓటేసినా కూడా ఆయ‌న వ‌య‌సు రీత్యా పూర్తి కాలం ప‌రిపాలించ‌లేర‌ని మ‌ధ్య‌లోనే కొడుక్కు రాష్ట్రాన్ని అప్ప‌గించేస్తార‌నే భ‌యం కూడా ప్ర‌జ‌ల్లో బాగానే ఉంది.

ఈ పాయింట్‌ను కూడా వైసీపీ రాబోయే ఎన్నిక‌ల కోసం ఉప‌యోగించే అవ‌కాశం ఉంది.ఇలా ఎటు చూసినా కూడా టీడీపీ మైన‌స్ పాయింట్లే వైసీపీకి ప్ల‌స్ అయ్యే అవ‌కాశం ఉంద‌న్న‌మాట‌.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube