వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఏపీలో రానున్న ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని తెలిపారు.
తాము వేరే ఏ పార్టీతో పొత్తు పెట్టుకోనేది లేదని ఆయన స్పష్టం చేశారు.అయితే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామంటే ఏ పార్టీకైనా మద్ధతు ఇస్తామంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారని తెలుస్తోంది.
బీజేపీ, టీడీపీ పొత్తు పెట్టుకుంటే అది వైసీపీకే మంచిదన్నారని సమాచారం.అనంతరం బీజేపీ అధ్యక్షురాలిగా పురంధేశ్వరి నియామకంపై స్పందించిన మిథున్ రెడ్డి ఆ విషయం వలన తమకు ఎటువంటి ఇబ్బంది లేదని తెలిపారు.