భారత్ లో వాట్సాప్ బ్యాన్ కానుందా..?!

గురువారం రోజు భారత ప్రభుత్వం మధ్యవర్తిత్వ మార్గదర్శకాలు, డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్స్ తో కూడిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్-2021 ని ప్రకటించింది.

అయితే 2021లో ప్రకటించిన ఈ సరికొత్త నిబంధనలు త్వరలోనే అమల్లోకి రానున్నాయి.

అయితే మెసేజ్లు ఎవరు పంపించారు అనే విషయాన్ని తమకు ఖచ్చితంగా చెప్పాలని టెలిగ్రామ్, వాట్సాప్, ఫేసుబుక్, ఇన్ స్టాగ్రామ్ సంస్థలపై భారత ప్రభుత్వం కొత్తగా నిబంధనలు తెచ్చింది.దీనితో ఎండ్-టు-ఎండ్ ఎన్‌స్క్రిప్షన్ ప్రైవసీ పద్ధతిని ఫాలో అవుతున్న టెలిగ్రామ్, వాట్సాప్ వంటి మెసెంజింగ్ అప్లికేషన్లు ఇకపై తమ రూల్స్ ని విడనాడి భారత ప్రభుత్వం నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.

ఎవరు మెసేజ్ లు పంపించారు? ఏం మెసేజ్ లు పంపించారు? అనే విషయాలు మూడో వ్యక్తి తెలుసుకోకుండా ఎన్‌స్క్రిప్షన్విధానానికి వాట్సాప్ వంటి మెసెంజింగ్ యాప్స్ శ్రీకారం చుట్టాయి.కానీ ఒక ట్వీట్ గాని మెసేజ్ గానీ ఇతర దేశాల నుంచి ఇండియాలో నివసిస్తున్న వ్యక్తి కి వస్తే ఆ మెసేజ్ పొందిన వ్యక్తి ఎవరో తెలపాలని ఇప్పుడు భారత ప్రభుత్వం ఒత్తిడి చేస్తోంది.దీనితో ఇక వాట్సాప్ ఇప్పటివరకు పాటించిన రూల్స్ ని బ్రేక్ చేయాల్సి వస్తోంది.2018 లో వాట్సాప్ ప్రతినిధి మాట్లాడుతూ ట్రేస్ చేసే వెసులుబాటు ఎవరికైనా కల్పిస్తే ఎండ్-టు-ఎండ్ ఎన్‌స్క్రిప్షన్ కి నాశనం చేసినట్లు అవుతుంది, అలాగే వాట్సాప్ యూజర్ల ప్రైవసీ కి భంగం కలిగించినట్లు అవుతుంది.ఎట్టి పరిస్థితులలోనూ మేము వాట్సాప్ వినియోగదారుల ప్రైవసీ విషయంలో కాంప్రమైజ్ అవ్వము అని అన్నారు.

మరి భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త నిబంధనలకు వాట్సాప్ కట్టుబడి తమ వినియోగదారుల ఐడెంటిఫికేషన్ ని బయట పెట్టడానికి అంగీకరిస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.ఒకవేళ వాట్సాప్ ఇండియన్ రూల్స్ పాటించకపోతే చేయడానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచించదు.

Advertisement

అయితే కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ మాట్లాడుతూ తాము మెసేజ్ లోని కంటెంట్ గాని వినియోగదారుడి గురించి సమాచారం గానీ తెలుసుకోవాలి అని అనుకోవడం లేదని కేవలం వినియోగదారుల ఐడెంటిఫికేషన్ చెబితే చాలు అని ఇందుకుగాను ఎండ్-టు-ఎండ్ ఎన్‌స్క్రిప్షన్ బ్రేక్ చేయాల్సిన అవసరమే లేదని స్పష్టం చేశారు.

వీడియో: గుర్రాన్ని గెలికిన బుడ్డోడు.. లాస్ట్ ట్విస్ట్ చూస్తే గుండె బద్దలు..
Advertisement

తాజా వార్తలు