విశ్వకర్మ యోజన బీజేపీకి కలిసివచ్చేనా..?

ఒకప్పుడు భారతదేశానికి పల్లెలే పట్టుకొమ్మలు అనేవారు.కానీ ప్రస్తుతం పల్లెల పరిస్థితి మారిపోయింది.

 Will Vishwakarma Yojana Come Together With Bjp , Bjp, Vishwakarma Yojana, Polit-TeluguStop.com

పల్లెల్లో రకరకాల చేతి వృత్తులు చేసేవారు పట్టణాలకు వెళ్లి ఎన్నో కష్టాలు పడి గేట్ కీపర్ లుగా, క్యాబ్ డ్రైవర్లుగా చేస్తున్నారు.మరి అలా చేతివృత్తులు పడిపోవడానికి కారణాలు పెద్ద పెద్ద కంపెనీలు రావడమే.

ఒకప్పుడు పల్లెల్లో వడ్రంగులు, కమ్మరి,కుమ్మరి, అవుసుల, మేర ఇలా ఎన్నో కుల వృత్తుల వాళ్ళు వారి వారి కులవృత్తులు చేసుకుంటూ జీవనం సాగించేవారు.ఈ క్రమంలో అలా వారు తయారు చేసిన వస్తువులను అప్పట్లో కొనుక్కునేవారు.

దీనివల్ల వారికి లాభాలు వచ్చేవి.వారి కుటుంబాలు కూడా బతికేవి.

Telugu Bc Bandu, Minarity Bandu, Narendra Modi-Politics

కానీ ప్రస్తుతం మార్కెట్లోకి అనేక కంపెనీలు వచ్చాయి .ప్రతి వస్తువు కంపెనీలో తయారవుతూ ప్రజల్లోకి వస్తోంది.దీంతో చేతి వృత్తిదారులు తయారు చేసిన వస్తువులను ఎవరు కూడా కొనడం లేదు.ఈ క్రమంలోనే పల్లెల్లో ఉండే చేతి వృత్తి వాళ్ళు చితికిపోయారు.

వీరిపై ప్రభుత్వాలు కూడా దృష్టి పెట్టలేదు.దీంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం విశ్వకర్మ యోజన ( Vishwakarma Yojana ) అనే పథకాన్ని చేతి వృత్తుల కోసం తీసుకువచ్చింది.ఈ పథకం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి అత్యధిక మంది బీసీలు లబ్ది పొందే అవకాశం ఉంది.

ఈ పథకం ఓబీసీకి చెందిన 18 రకాల కులాలకు వర్తిస్తుంది.అయితే ఈ పథకం ద్వారా ఐదు శాతం వడ్డీ రాయితీతో కేంద్రం లక్ష రూపాయల రుణాన్ని అందించనుంది.

Telugu Bc Bandu, Minarity Bandu, Narendra Modi-Politics

ఈ రుణాన్ని పొందడం ద్వారా చేతివృత్తుల వారు కాస్త తేరుకునే అవకాశం ఉందని బిజెపి ( BJP ) ఈ పథకం తీసుకువచ్చినట్టు తెలుస్తోంది.కొన్ని నెలల్లో ఎలక్షన్స్ ఉన్న తరుణంలో నరేంద్ర మోడీ ఈ ప్రకటన చేయడంతో బీసీ కుల వృత్తుల వారు ఆనంద పడుతున్నారు.ఈ పథకం పూర్తిస్థాయిలో గ్రామాల్లోకి వచ్చింది అంటే తెలంగాణ రాష్ట్రంలో బిజెపికి కాస్త రాజకీయంగా కలిసివచ్చే పథకంగా కనిపిస్తోంది.కానీ ఇందులో మరోటి గమనించాలి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ బీసీ బంధు(BC Bandu) ,మైనారిటీ బంధు పేరుతో బీసీలను ఆకట్టుకునేందుకు పథకం తీసుకువచ్చింది.

ఈ తరుణంలోనే బిజెపి విశ్వకర్మ యోజన పథకాన్ని తీసుకురావడం విశేషం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube