వైసీపీ ప్లీనరీకి విజయమ్మ వస్తారా ,? అనుమానమే ?

చాలా కాలంగా వైసీపీతో సంబంధం లేదన్నట్లుగానే ఉన్నారనే ప్రచారం జరుగుతోంది.విజయమ్మ కూడా వైసిపి కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనడం లేదు.

 Will Vijayamma Come To Ycp Plenary Doubtful Ys Jagan, Ys Vijayamma, Ap, Ysrcp P-TeluguStop.com

వైసిపి గౌరవ అధ్యక్షురాలి హోదాలో ఉన్న వైఎస్ విజయమ్మ తెలంగాణలో వైఎస్సార్ తెలంగాణ పార్టీకి గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నారు.  దీంతో ఆమె ఏ పార్టీలో కొనసాగుతారు అనే అనుమానం చాలా కాలం నుంచి అందరిలోనూ ఉంది.

ఎక్కువగా షర్మిల తోనే విజయమ్మ ఉంటుండడంతో జగన్ కుటుంబంలో విభేదాలు తలెత్తయని , అందుకే జగన్ కు వైసిపికి దూరంగా విజయమ్మ ఉంటున్నారనే ప్రచారం జరుగుతోంది.ఇది ఎలా ఉంటే ఈనెల 7 ,8 తేదీల్లో వైయస్సార్ సీపీ రాష్ట్రస్థాయి ప్లినరిని నిర్వహించేందుకు ఏర్పాట్లు భారీగా చేస్తున్నారు.

       ఈ ప్లీనరీలో ఈసారి గౌరవ అధ్యక్షురాలి హోదాలో విజయమ్మ హాజరవుతారా లేదా అనే అనుమానం పార్టీ నేతల్లో కలుగుతోంది.ఎందుకంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కంటే, షర్మిల స్థాపించిన వైఎస్సార్ తెలంగాణ పార్టీలోనే విజయమ్మ యాక్టివ్ గా పాల్గొంటూ అనేక నిరసన కార్యక్రమాల్లోనూ ప్రత్యక్షంగా పాల్గొన్నారు.

ప్రస్తుతం విజయమ్మ షర్మిల కుమారుడు రాజారెడ్డి అమెరికాలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడంతో అక్కడ జరిగే కాన్వకేషన్ కార్యక్రమానికి షర్మిల తో పాటు విజయమ్మ వెళ్లారు.మరోవైపు చూస్తే జగన్ తన కుమార్తె హర్ష రెడ్డి కాన్వకేషన్ కు వెళ్లారు.

విజయమ్మ జగన్ కుమార్తె కాన్వకేషన్ కు వెళ్లలేదనే ప్రచారం జరుగుతోంది.
   

Telugu Jagan, Raja Reddy, Sharmila, Ys Harsha Reddy, Ys Jagan, Ys Vijayamma, Ysr

  ఈ క్రమంలోనే ప్లినరికి విజయమ్మ రాకపై అందరికీ అనుమానాలు కలుగుతున్నాయి.విజయమ్మ కనుక ఈ ప్లేనరీ సమావేశాలకు హాజరుకాకపోతే ఇక వైసీపీతో తెగ తెంపులు చేసుకున్నారనే సంకేతాలు పార్టీ శ్రేణులకు, జనాల్లోకి వెళ్తాయి.అదే జరిగితే జగన్ కుటుంబంలో విభేదాలు ఉన్నాయంటూ పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రచారానికి మరింత బలం చేకూరుతుంది అనడంలో సందేహం లేదు.

 

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube