పవన్ కళ్యాణ్ సినిమాలో భూమిక...  

Will Veteran Actress Bhoomika Play Powerful Role In Pawan Kalyan Movie - Telugu Bhoomika, Bhoomika And Pawan Kalyan Movie, Bhoomika Movie Latest News, Bhoomika Movie News, Pawan Kalyan New Movie, Pawan Kalyan News

ప్రస్తుతం టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నటువంటి “లాయర్ సాబ్” అనే చిత్రంలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.ఈ చిత్రం బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ నటించినటువంటి “పింక్” చిత్రానికి రీమేక్ గా ఉంది.

Will Veteran Actress Bhoomika Play Powerful Role In Pawan Kalyan Movie - Telugu And Latest News New

ఈ చిత్రంలో కీలక పాత్రలో నివేదాథామస్ నటిస్తోంది.అలాగే ఈ చిత్రాన్ని టాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నాడు.

అయితే ఈ చిత్రం లో ఒకప్పుడు పవన్ కళ్యాణ్ నటించిన టువంటి ఖుషి చిత్రంలో మధుమతి పాత్ర పోషించిన టువంటి భూమిక నటిస్తున్నట్లు పలు కథనాలు వినిపిస్తున్నాయి.అంతేగాక  ఇప్పటికే భూమిక పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి కొన్ని కీలక సన్నివేశాలు కూడా చిత్రీకరించినట్లు సమాచారం.

దీంతో ఒకప్పుడు ఖుషి సినిమాలో నడుము సీన్ లో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన టువంటి ఈ జంట మరోసారి స్క్రీన్ మీద కనిపించనుండడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఆనందానికి హద్దులు లేకుండా పోతున్నాయి.

అయితే ఇది ఇలా ఉండగా భూమిక నందమూరి బాలకృష్ణ నటించినటువంటి రూలర్ చిత్రంలో నటించింది.ఒకప్పుడు స్టార్ హీరోల సరసన నటించిన టువంటి భూమిక వయసు పైబడటంతో ఇప్పుడు ఎటువంటి పాత్రలోనైనా నటించేందుకు ఓకే చెబుతోంది.ఇందులో భాగంగానే గ్లామర్ కి ప్రాధాన్యత లేకపోయినప్పటికీ తన పాత్రకి ప్రాధాన్యత ఉంటే చాలు అనుకుంటూ పలు చిత్రాల్లో కనిపించింది.

తాజా వార్తలు