రేపు ఏర్పడే సూర్య గ్రహణం భారత్ లో స్పష్టంగా కనిపిస్తుందా..?!

ఈ సంవత్సరపు ఆఖరి సూర్యగ్రహణం డిసెంబర్ 14న సంభవించనుంది.డిసెంబర్ 14న ఉదయం 7 గంటల 3నిమిషాల సమయం నుండి మధ్యాహ్నం 12 గంటల 23 నిమిషాల వరకు ఈ సూర్యగ్రహణం ఉండబోతోంది.

 Tomorrow's , Solar Eclipse, Visible, India, December14th, Darkness-TeluguStop.com

మామూలుగా సూర్యుడికి, భూమికి మధ్య చంద్రుడు వచ్చే సమయంలో సూర్య గ్రహణం ఏర్పడుతుంది అన్న విషయం మనకు తెలిసిందే.అయితే ఇలాంటి సమయంలో ప్రపంచంలో చాలా ప్రదేశాలలో కొన్ని ప్రాంతాలు చీకటిమయం అవుతాయి అన్న సంగతి కూడా మనకు తెలిసిందే.

ఇకపోతే డిసెంబర్ 14న రాబోయే సూర్యగ్రహణానికి ఈ భూమిపై అనేక ప్రాంతాలలో చీకటి ఏర్పడబోతోంది.ముఖ్యంగా ఈ చీకటి భూమిపై దక్షిణ అమెరికా ప్రాంతంలోని చిలీ, అర్జెంటీనా దేశాలలో ఉంటుందని.

మిగతా ప్రదేశాలలో దాని ప్రభావం ఎక్కువగా ఉండదు అన్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు.సూర్య గ్రహణం కారణంగా భారతదేశంలో ఎలా ఉండబోతుంది అన్న విషయానికి వస్తే.డిసెంబర్ 14న సంభవించే సూర్యగ్రహణం భారత్ లో కేవలం పాక్షిక సూర్యగ్రహణం ఉండబోతుందని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు.

Telugu Darkness, Decemberth, India, Solar Eclipse, Tomorrows, Visible-Latest New

పాక్షిక సూర్య గ్రహణం కారణంగా భారతదేశంలో ఎలాంటి చీకట్లు కమ్ముకోవని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు.కాకపోతే సూర్యుడిపై మాత్రం చంద్రుడి నీడ స్పష్టంగా కనబడుతుంది అని వారు తెలియజేస్తున్నారు.అలాగే ఖగోళ శాస్త్రవేత్తలు సూర్యగ్రహణాన్ని ప్రజలు నేరుగా కంటితో చూడకుండా ఫిల్మ్ లాంటి సాధనాలను ఉపయోగించి చూడండి అంటూ తెలుపుతున్నారు.

కాబట్టి మీలో ఎవరైనా ఖగోళ ప్రేమికులు ఉంటే మీరు కచ్చితంగా ఫిల్మ్ లేదా అత్యాధునిక పరికరాలను ఉపయోగించి గ్రహణాన్ని చూడడం మీకు ఎంతో శ్రేయస్కరం.ఇలా చేయడం వల్ల మీ కంటికి ఎలాంటి ఇబ్బందులు ఎదురు కావు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube