టిక్‌టాక్ మళ్లీ ఇండియాలో ఎంట్రీ ఇస్తుందా..?

టిక్‌టాక్ భారతదేశంలో బ్యాన్ అయిన విషయం తెలిసిందే.చాలా కాలంగా ఇండియాలో దీనిపై బ్యాన్‌ కొనసాగుతోంది.

 Will Tiktok Re-enter India Details, Tik Tok, India, Entry, Technology Updates, T-TeluguStop.com

అయితే ఈ షార్ట్-వీడియో షేరింగ్ యాప్ ఇండియాలో రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.టిక్‌టాక్ యాజమాన్య కంపెనీ బైట్‌డాన్స్ ఇండియాలో టిక్‌టాక్‌ను తీసుకొచ్చేందుకు ముంబైకి చెందిన కంపెనీతో చర్చలు జరుపుతోంది.

ప్రముఖ ఇండియన్ గేమింగ్ వెంచర్ Skyesports సీఈఓ మాట్లాడుతూ… టిక్‌టాక్ యాప్ నిజంగానే ఇండియాలో తిరిగి వస్తుందని పేర్కొన్నారు.

దేశ ప్రజల భద్రతే లక్ష్యంగా ఇండియా టిక్‌టాక్‌ను 2020లో నిషేధించింది.

అయితే టిక్‌టాక్ త్వరలో భారత్‌కు తిరిగి వస్తుందని స్కైస్పోర్ట్స్ సీఈఓ శివ నంది తెలిపారు.ఈ చైనీస్ యాప్ ఇండియాలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే సూపర్ పాపులర్ అయ్యింది.

పొద్దున్నే లేచిన సమయం నుంచి రాత్రి పడుకునే వరకు చాలా మంది టిక్ టాక్ లోనే గడిపారు అంటే అతిశయోక్తి కాదు.దీని ద్వారా చిన్నపాటి సెలబ్రెటీలుగా మారి డబ్బు సంపాదించిన వారు కూడా ఉన్నారు.

అయితే అది అకస్మాత్తుగా బ్యాన్ కావడంతో చాలా మంది ఇన్‌కమ్ సోర్సింగ్ కోల్పోయారు.

Telugu Byte Dance, Ceo Shiva Nandi, India, Ups, Tik Tok, Tiktok Ban, Tiktok Indi

ఇప్పుడు ఇది మళ్లీ వస్తుందని చెప్పడంతో క్రియేటర్స్ ఖుషి అవుతున్నారు. ‘టిక్‌టాక్’ పేరెంట్ కంపెనీ బైట్ డ్యాన్స్ ఇండియాలో షాట్ వీడియో షేరింగ్ యాప్ రానుందని త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.ఇదే జరిగితే క్రియేటర్స్‌కి పండుగే అని చెప్పవచ్చు.

టిక్‌టాక్ బ్యాన్‌ అయిన తర్వాత ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్ వీడియోస్, ఫేస్‌బుక్ రీల్స్ వంటివి ఇండియాలో బాగా పాపులర్ అయ్యాయి.ప్రస్తుతానికి క్రియేటర్స్ వీటిని ఉపయోగిస్తూ కాలం గడుపుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube