తెలంగాణలో వున్న ఆ రాళ్లకు యునెస్కో గుర్తింపు లభించనుందా? అంత విషయం ఏముంది ఆ రాళ్ళలో?

తెలంగాణ.రాళ్లు అనగానే అందరికీ ముందుగా ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లానే గుర్తొస్తుంది.

 Will Those Stones In Telangana Get Unesco Recognition , Telangana, Vertical Sto-TeluguStop.com

అవును.మక్తల్ నియోజకవర్గం, కృష్ణ మండలం ముడుమాల్ వద్ద నిలువు రాళ్లు వున్న సంగతి తెలిసినదే.

ప్రపంచ ప్రఖ్యాత చెందిన ఈ నిలువు రాళ్లకు యునెస్కో గుర్తింపు తీసుకు వచ్చే దిశగా చర్యలు చేపడుతున్నట్లు జై మక్తల్ ట్రస్ట్ అధ్యక్షుడు, టీటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ కుమార్ మఖ్తల తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.ఇందులో భాగంగా జూన్ 21 సమ్మర్ సాల్ స్టిస్ సందర్భంగా నిలువురాళ్ళ వద్ద ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ రఘునందన్ తో కలిసి సూర్యుడి గమన దిశలను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఇంటర్వ్యూలో జై మఖ్తల్ ట్రస్ట్ అధ్యక్షుడు సందీప్ కుమార్ మఖ్తల మాట్లాడుతూ.ఆర్బిట్ 2022 లో భాగంగా నిలువురాళ్లకు యునెస్కో గుర్తింపు తీసుకు వచ్చే దిశగా మార్చి 20, 21వ తేదీన ఈక్వినాక్స్ పరిశీలించగా తాజాగా రెండో అడుగులో భాగంగా.

జూన్ 21 సాల్ట్ సిస్.అనగా లాంగెస్ట్ డే.పగలు ఎక్కువ ఉన్న రోజు అని అర్థం.ఈ రోజున నిలువురాళ్ళ వద్ద సూర్యుని గమన దిశలు ఇతరత్రా నమోదు చేసుకోవడం జరిగిందని , యునెస్కో (UNESCO) గుర్తింపు కోసం కీలకమైన డాక్యుమెంటేషన్కు ఈ వివరాలు తీసుకోవడం జరిగిందని అన్నారు.

Telugu Telangana, Unesco, Vertical, Latest-Latest News - Telugu

ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ రఘునందన్ మాట్లాడుతూ.“3500 సంవత్సరాల క్రితం అప్పటి ఆదిమానవులు.ఎలాంటి టెక్నాలజీ లేకుండా ప్రస్తుతమున్న టెలిస్కోప్, శాటిలైట్ల తో సూర్యగమనం వాతావరణ దిశలను తెలుసుకుంటున్నా.అప్పటి ఆదిమానవులు ఇవేవీ లేకుండానే సూర్యుడి యొక్క గమన దిశలు, వాతావరణ మార్పులు తెలుసుకున్నారని అన్నారు.

అందుకు నిదర్శనంగానే నిలువురాళ్ళు ఏర్పాటు చేశారని తెలిపారు.నిలువురాళ్ల ను పోలిన నిర్మాణం ఇంగ్లాండ్ లోని స్టోన్ హెంజ్ ఉంటుందని ఆయన అన్నారు.”

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube