కేసీఆర్ వేసిన ఈ వ్యూహం భవిష్యత్ బీజేపీ ఎదుగుదలకు అడ్డంకి కానుందా?

Will This Strategy Of Kcr Be An Obstacle To The Future Growth Of The

తెలంగాణ రాజకీయాల్లో కెసీఆర్ ను మించిన వ్యూహ కర్త లేరనే విషయం ఎవరూ కదనలేని సత్యం.అటువంటి వ్యూహాలతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అని అంగీకరించే వాళ్ళ సంఖ్య ఎక్కువ.

 Will This Strategy Of Kcr Be An Obstacle To The Future Growth Of The-TeluguStop.com

అయితే తెలంగాణ రాష్ట్రం సాధించిన తరువాత రెండు సార్లు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కెసీఆర్ పెద్దగా ఎటువంటి అడ్డంకులు లేకుండానే రెండు సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు.కానీ గత ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుతం రాజకీయ వాతావరణం చాలా భిన్నంగా ఉన్న పరిస్థితి ఉంది.

ప్రస్తుతం ఎంతో కొంత బలంగా ఉన్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు గత రెండు సార్వత్రిక ఎన్నికల కంటే ముందు బలంగా లేని పరిస్థితి.కానీ ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రజల్లోనే ఉండేలా తమ కార్యాచరణను రూపొందించుకుంటున్న పరిస్థితి ఉంది.

 Will This Strategy Of Kcr Be An Obstacle To The Future Growth Of The-కేసీఆర్ వేసిన ఈ వ్యూహం భవిష్యత్ బీజేపీ ఎదుగుదలకు అడ్డంకి కానుందా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక అసలు విషయానికొస్తే బీజేపీ రాజకీయ శైలి మతం ఆధారంగా ఉంటుంది.ఇటీవల జరిగిన బహిరంగ సభలో 80 శాతం మంది హిందువులకె తమ తొలి ప్రాధాన్యత అని చెప్పిన విషయం మనకు విదితమే.

  అయితే బీజేపీ హిందూ మత రాజకీయం ప్రారంభం చేస్తున్న దశలో కెసీఆర్ కూడా అదే వ్యూహాన్ని ప్రయోగించి బీజేపీకి అడ్డుకట్ట వేసేందుకు ప్రణాళికలు రచిస్తున్న పరిస్థితి ఉంది.

Telugu Bandi Sanjay, Bjp Hindu, Bjp, Congress, Kcr, Telangana, Trs, Ts Cm Kcr, Yadadri Temple-Political

మార్చి 28 న యాదాద్రి పునః ప్రారంభం కాబోతున్న విషయం తెలిసిందే.అయితే ఈ సందర్భంగా ప్రతి ఒక్క నియోజకవర్గం యాదాద్రి పునః ప్రారంభంలో భాగస్వామ్యం కావాలనే ఉద్దేశ్యంతో బంగారం రూపంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.తద్వారా ప్రతి ఒక్కరూ ఈ గుడి నిర్మాణంలో మేము భాగస్వామయులం అనే భావన వచ్చి తమ దృష్టిలో కెసీఆర్ పై ఎప్పటికీ ఒక సానుకూల భావన ఉండే అవకాశం ఉంది.

తద్వారా హిందూ భావజాలంతో దెబ్బ కొడదామనుకున్న బీజేపీకి ఇలా చాలా వ్యూహాలతో దెబ్బ కొట్టే అవకాశం కనిపిస్తోంది.

#Congress #Bjp #Kcr #Cm Kcr #Telangana

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube