బిగ్‌బాస్‌ లీక్‌ : ఈ వారం జాఫర్‌ ఔట్‌

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 3 రెండవ వారం ఎలిమినేషన్‌ ఎవరు అనే విషయంపై క్లారిటీ వచ్చేసింది.వితిక షేరు మరియు రాహుల్‌, జాఫర్‌లలో ఎవరో ఒకరు ఎలిమినేట్‌ అవుతారు అంటూ ప్రచారం జరుగుతుంది.

 Will This Contestant Be Eliminated From Bigg Boss Telugu 3-TeluguStop.com

తాజాగా ఆ విషయం తేలిపోయింది.వితిక షేరు మరియు రాహుల్‌లను సేవ్‌ చేసి జాఫర్‌ను ఎలిమినేట్‌ చేసినట్లుగా సమాచారం అందుతోంది.

ఆదివారం ప్రసారం కాబోతున్న ఎపిసోడ్‌కు సంబంధించిన షూట్‌ను నిన్ననే పూర్తి చేయడం జరిగింది.

నేడు జాఫర్‌ను ఎలిమినేట్‌ చేసినట్లుగా ప్రకటించడంతో పాటు ఆయనతో నాగార్జున స్టేజ్‌పై మాట్లాడించబోతున్నాడు.

మొత్తానికి జాఫర్‌ కాస్త ఎక్కువ రోజులు ఉంటాడు అనుకుంటే వెంటనే వెళ్లి పోతున్నాడు.అయితే ప్రస్తుతం ఇంట్లో ఉన్న వారిలో తక్కువ పాపులారిటీ ఉన్న వ్యక్తి జాఫర్‌ అని, దాంతో పాటు ఆయన ఇంటి సభ్యులతో కలిసి పోలేక పోతున్నాడు అంటూ అంతా భావించి ఓట్లు వేయలేదని తెలుస్తోంది.

మొదటి వారంలో హేమ ఎలిమినేట్‌ అయితే ఈ వారం జాఫర్‌ ఎలిమినేషన్‌కు సిద్దంగా ఉన్నాడు.జాఫర్‌ ఎలిమినేషన్‌పై అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

వితికకు తక్కువ ఓట్లు పడ్డా కూడా వరుణ్‌ సందేశ్‌తో ఆమె ఉంటే జోడీ ఉందనే ఉద్దేశ్యంతో బాగుంటుందని టీం సభ్యులు జాఫర్‌కు ఉద్వాసన పలికినట్లుగా సమాచారం అందుతోంది.మొత్తానికి బిగ్‌బాస్‌ సీజన్‌ 3 నుండి మరో కంటెస్టెంట్‌ అయిన జాఫర్‌ ఎలిమినేట్‌ అవ్వబోతున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube