ఐపీఎల్‌-23లో ఈ స్టార్‌ ఆటగాళ్లు కనబడరా?

ఐపీఎల్‌-2023 హడావుడి అప్పుడే మొదలైపోయింది.మార్చి 31 నుంచి ఐపీఎల్‌ సీజన్‌ ప్రారంభం కావడంతో యావత్ ఐపీఎల్‌ క్రికెట్ అభిమానులు చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

 Will These Star Players Be Seen In Ipl-23 Ipl Auction, Ipl 2023 , Star Players,-TeluguStop.com

ఈ నేపథ్యంలో ఓపెనింగ్‌ మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ను చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఢీకొట్టనుంది.అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ ఐకానిక్‌ స్టేడియంలో రాత్రి 7:30 గంటకు ఈ మ్యాచ్‌ దిగ్విజయంగా ఆరంభం కానుంది.ఎప్పుడూ దేశ, విదేశీ స్టార్లతో కలకలలాడే క్రికెట్‌ పండుగ ఈసారి కాస్త డల్ గా మారబోతోంది.విషయం అందరికీ తెలిసిందే… గాయాల కారణంగా చాలామంది స్టార్లు ఈ సీజన్‌ మొత్తానికే దూరం కానున్నారు.

కొందరు ఆటగాళ్లు అయితే ఆరంభ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండటం లేదు.ఈ క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ కి చెందిన సర్ఫరాజ్‌ ఖాన్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ – ముకేశ్‌ చౌదరీ, లక్నో సూపర్‌ జెయింట్స్‌ – మొహిసిన్‌ ఖాన్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ కెప్టెన్‌ – శ్రేయస్‌ అయ్యర్‌( Shreyas Iyer ) లు అయితే ఐపీఎల్‌-2023లో పాల్గొంటారో లేదో తెలియని పరిస్థితి వుంది.పాల్గొనేది లేనిది తెలియాల్సి ఉంది.ఇకపోతే గాయాల కారణంగా ఐపీఎల్‌ 16వ ఎడిషన్‌ మొత్తానికే దూరం కానున్న స్టార్‌ ఆటగాళ్ల జాబితాను ఒకసారి పరిశీలిస్తే…

ముంబై ఇండియన్స్‌ కి చెందిన జస్ప్రీత్‌ బుమ్రా( Jasprit Bumrah ), ఢిల్లీ క్యాపిటల్స్‌ – కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ – కైల్‌ జేమీసన్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు – విల్‌ జాక్స్‌, ముంబై ఇండియన్స్‌ – జై రిచర్డ్‌సన్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ – అన్రిచ్‌ నోర్జే, రాజస్తాన్‌ రాయల్స్‌ – ప్రిసిద్ధ్‌ కృష్ణ, పంజాబ్‌ కింగ్స్‌ – జానీ బెయిర్‌స్టో( Jonny Bairstow ) తదితరులు గాయాల కారణంగా ఐపీఎల్‌ 16వ ఎడిషన్‌ మొత్తానికే దూరం కానున్నట్టు తెలుస్తోంది.అయితే ఇది అధికారిక ప్రకటన మాత్రం కాదు.గాయాలు కాస్త మానిపోయిన ఆటగాళ్లు విధిగా బరిలో దిగే అవకాశాలు కూడా లేకపోలేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube