త్వరలో తెలంగాణలో మరో ఉప ఎన్నిక రానుందా?

మాజీ మంత్రి ఈటెల ఎపిసోడ్ రోజురోజుకో మలుపు తిరుగుతోంది.రోజుకో సంచలన వ్యాఖ్యలు చేస్తూ, అన్ని వర్గాల ప్రజలను కలుస్తూ, పార్టీలో ఉన్నప్పుడు ఎప్పుడు కులం ప్రస్తావన తీసుకురాని ఈటెల రాష్ట్ర వ్యాప్తంగా ముదిరాజ్ సంఘ నేతలను వెంటపెట్టుకుని తిరుగుతూ సరికొత్త రాజకీయానికి మాజీ మంత్రి ఈటెల రాజేందర్ శ్రీకారం చుడుతున్నట్టు తెలుస్తోంది.

 Will There Be Another By Election In Telangana Soon-TeluguStop.com

అయితే రాజేందర్ ను ఈ వైపుగా కేసీఆర్ వ్యతిరేక వర్గం నడిపిస్తోందా, ఈటెల స్వయంగా ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారా అనేది రాజకీయ విశ్లేషకులకు అంతుపట్టడం లేదు.కేసీఆర్ లాంటి మహా నేతను ఎదుర్కోవడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు.

అయితే తాజాగా ఈటెల వేస్తున్న స్టెప్పులు చూస్తుంటే టీఆర్ఎస్ కు రాజీనామా చేసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది.అయితే ఇది ఎంతవరకు నిజం అన్నది తెలియరాకున్నా కేసీఆర్ ఇబ్బంది పెడుతున్న తీరును చూసి ఈటెల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి ఏ మాత్రం ఆలోచించడని ఈటెల సన్నిహితులు తెలుపుతున్నారు.

 Will There Be Another By Election In Telangana Soon-త్వరలో తెలంగాణలో మరో ఉప ఎన్నిక రానుందా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఒకవేళ ఈటెల రాజీనామా చేస్తే ఇక ఈటెల రాజేందర్ నియోజకవర్గమైన హుజురాబాద్ కు ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.ఇక ఫోకస్ మొత్తం ఇప్పుడు హుజురాబాద్ నియోజకవర్గం  పై ఈ వ్యవహారంలో ఏమి జరుగుతుందనేది భవిష్యత్తులో చూడాల్సి ఉంది.

#Eetela On Kcr #HuzurabadBy #EetelaAssigned #Eetela Rajender

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు