వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు బీజేపీకి మధ్యే కీలక వార్ జరగనుందా

తెలంగాణలో ఇప్పటి వరకు జరిగిన సార్వత్రిక ఎన్నికలు ఒక ఎత్తు, వచ్చే సార్వత్రిక ఎన్నికలు ఒక ఎత్తు.అవును ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలను చూస్తూ ఉంటే రాజకీయ వర్గాలు అవుననే సమాధానమిస్తున్నాయి.

 Will There Be A Key War Between The Trs And The Bjp In The Coming Elections Tela-TeluguStop.com

ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయ పార్టీగా మారాలని బీజేపీ రకరకాల వ్యూహాలను ప్రయోగిస్తూ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీపట్ల వ్యతిరేకత పెంచడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం.అయితే మరొక ప్రచారం ఏమిటంటే బీజేపీ ఎంతగా ప్రయత్నించినా టీఆర్ఎస్ ను గద్దె దింపేంతలా ప్రభావం చూపే ప్రసక్తి లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఎందుకంటే బీజేపీకి క్షేత్ర స్థాయిలో కార్యకర్తల నిర్మాణం అనేది లేదని ఏ పార్టీకైనా బలంగా నిర్మించుకోవాలంటే చాలా కష్టమైన వ్యవహారమని అందుకే టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవడం అనేది బీజేపీకి చాలా కష్టతరమైన వ్యవహారమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ బీజేపీ కంటే ముందంజలో ఉన్నా ఎన్నికల సమయానికి రెండు పార్టీలు సరి సమాన బలాబలాలకు చేరుకుంటాయని తెలుస్తోంది.

అయితే అధికారంలోకి వచ్చే అవకాశం టీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉందని పలు సర్వేలు స్పష్టం చేస్తుండగా బీజేపీకి కొంత లోక్ సభ స్థానాలు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.ఏది ఏమైనా వచ్చే సార్వత్రిక ఎన్నికలు మాత్రం భీకర విమర్శలు, ప్రతి విమర్శలతో రణరంగాన్ని తలపించేలా ఉండనున్నాయి.

ఇప్పటికే కెసీఆర్ ఆ రకమైన పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలనే దానిపై ఒక స్పష్టతకు రాగా బీజేపీ కూడా తమ వ్యూహంపై చాలా నమ్మకంగా ఉన్న పరిస్థితి ఉంది.మరి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, టీఆర్ఎస్ కు మధ్య జరిగే కీలక పోరులో ఎవరు విజయం సాధిస్తారనేది చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube