రాష్ట్రంలో అభివృద్ధి లేదంటున్న వైసీపీ ఎమ్మెల్యే.. అధిష్టానం పట్టించుకుంటుందా?

నెల్లూరు జిల్లా వైసీపీలో కీలక నేత కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి టోన్ మారుతోంది.మొన్నటివరకు జగన్ అన్నా అంటూ ఆప్యాయంగా పిలిచిన ఆయన ఇప్పుడు ప్రభుత్వంలోని లోటుపాట్లను స్వయంగా వేలెత్తి చూపుతున్నారు.

 Will The Ycp Leadership Consider Kotam Reddy S Comments , Andhra Pradesh , Ysrcp-TeluguStop.com

రాష్ట్రంలోనూ, తన నియోజకవర్గంలోనూ అభివృద్దేమీ లేదంటూ ఆరోపణలు చేస్తున్నారు.పార్టీ వైపు కాకుండా ప్రజల వైపు నిలబడి సమస్యలను తెలుసుకుంటున్నారు.

దీంతో వైసీపీలో కోటంరెడ్డి వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

ఇటీవల తన సొంత నియోజకవర్గంలో మురుగుకాల్వలో దిగి కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి స్వయంగా నిరసన తెలియజేశారు.

నెల్లూరు లాంటి నగరంలో మురుగనీటి కాల్వల్లో పూడిక తీయాలంటే పట్టించుకునే నాథుడే లేడని ఆయన మండిపడ్డారు.నెల్లూరులో అడుగు తీసి అడుగు వేయలేనంతగా రోడ్లు గుంతలమయంగా తయారయ్యాయని.

జగనన్న కాలనీల్లో వసతుల గురించి నెలల తరబడి అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని.ఏం పని జరుగుతుందో.ఏ పని జరగడం లేదో అర్థంకాని పరిస్థితి నెలకొందని కోటంరెడ్డి అసహనం వ్యక్తం చేశారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని రోడ్లకు మరమ్మతులు నిర్వహించాలంటే రూ.100 కోట్లు అవుతుందని శ్రీధర్ రెడ్డి అంటున్నారు.

నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ఉమ్మారెడ్డి గుంటలోని మురుగుకాల్వపై వంతెన నిర్మాణం చేపట్టాలని ఎప్పటి నుంచో ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

అయినా అధికారులు స్పందించడం లేదు.దీంతో వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి స్వయంగా మురుగుకాల్వలోకి దిగి నిరసన తెలియజేశారు.

ప్రజా సమస్యలపై తాను అధికార పక్షమా.ప్రతిపక్షమా.

అని చూడనని తెలిపారు.సమస్యల పరిష్కారం కోసమే తాను ప్రయత్నిస్తానని స్పష్టం చేశారు.

Telugu Andhra Pradesh, Kotam Reddy, Kotamsridhar, Nellore, Sewers, Umma Gunta, Y

సాధారణంగా అభివృద్ధి పనులేమీ జరగడం లేదని విపక్ష ఎమ్మెల్యేలు కామెంట్లు చేస్తే లైట్ తీసుకోవడమో లేదా కౌంటర్ అటాక్ చేయడమో ప్రభుత్వ వర్గాలు చేస్తాయి.కానీ అధికార పార్టీ ఎమ్మెల్యే నోటి నుంచే ప్రజా సమస్యలపై నిజాలు తన్నుకుని వస్తుంటే అధికార వైసీపీ పెద్దలు ఏం చేస్తారో చూడాలంటూ ప్రజలు చర్చించుకోవడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube