ఆ ఇద్ద‌రినీ మంత్రి ప‌ద‌వి నుంచి తొల‌గిస్తారా.. శ్రీకాకుళం జిల్లాలో రాజ‌కీయం మారుతోందా..?

వైసీపీని గ‌త కొంత కాలంగా కుదిపేస్తున్న వార్త ఏదైనా ఉందా అంటే అది మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ అంశ‌మే.అయితే కొత్త వారికి ఇది గుడ్ న్యూస్ అయినా.

 Will The Two Be Removed From The Post Of Minister Is Politics Changing In Srikak-TeluguStop.com

ఇప్ప‌టికే మంత్రి ప‌ద‌వుల్లో ఉన్న వారికి మాత్రం ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి.ఎందుకంటే ఎప్పుడు ఎవ‌రి మంత్రి ప‌ద‌వి పోతుందో ఎవ‌రికీ తెలియ‌దు క‌దా.

ఇప్ప‌టికే జ‌గ‌న్ పాల‌నరెండున్న‌రేండ్లు పూర్తి చేసుకుంది.కాబ‌ట్టి త్వ‌ర‌లోనే మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ ఉండ‌బోతుంద‌ని తెలుస్తోంది.

ఇంకా చెప్పాలంటే ఈ సంక్రాంతి త‌ర్వాత ఎప్పుడైనా జ‌గ‌న్ మార్పులు చేసే అవ‌కాశం క‌నిపిస్తోంది.

కాగా ఈ అంశం ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా నుంచి మంత్రులుగా ఉన్న ఇద్ద‌రికి టెన్ష‌న్ ప‌ట్టుకుంది.

డిప్యూటీ సీఎం అయిన ధర్మాన క్రిష్ణ దాస్ తో పాటు పశు వర్ధక శాఖ మంత్రి సీదరి అప్పలరాజు ఇప్పుడు ఉత్త‌రాంధ్ర‌లో హాట్ టాపిక్ అవుతున్నారు.ఈ ఇద్ద‌రూ త‌మ ప‌ని విధానంలో అంత‌గా రాణించ‌లేక‌పోతున్నార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి.

ఇప్ప‌టికే శ్రీకాకుళం టీడీపీకి కంచుకోట లాంటిది.ఇక్క‌డ మొద‌టి నుంచి టీడీపీ హ‌వానే సాగుతోంది.

ఏ మాత్రం నిర్ల‌క్ష్యం చేసినా సైకిల్ దూసుకుపోతుంది.కాబ‌ట్టి ఈ ఇద్ద‌రూ స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేయాల‌ని ఎప్ప‌టి నుంచో జ‌గన్ టార్గెట్ ఇచ్చారు.

జిల్లా త‌ర‌ఫున ఉన్న ఈ ఇద్ద‌రూ వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ధీటైన నేత‌లుగా ఉండాల‌ని జ‌గ‌న్ భావిస్తుంటే.వారు మాత్రం అంత‌గా రాణించ‌లేక‌పోతున్నార‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.

ఈ ఇద్ద‌రూ చాలా విష‌యాల్లో వివాదాస్ప‌దం అవుతున్నారు.ఒక వేళ కృష్ణ దాస్‌ను ప‌క్క‌న పెడితే ఆయ‌న త‌మ్ముడు ప్రసాదరావుకు ఛాన్స్ ఇస్తారంట‌.ఆయ‌న అయిత‌నే రాబోయే ఎన్నిక‌ల్లో పార్టీని బ‌లంగా న‌డిపించ‌గ‌ల‌ర‌ని జ‌గ‌న్ భావిస్తున్నారంట‌.ఇక రెండో మంత్రిగా స్పీకర్ తమ్మినేని సీతారామ్ కు అవ‌కాశం ఇస్తారని చెబుతున్నారు.జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహితుడుగా ఉన్న ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి కావాల‌ని ఎప్ప‌టి నుంచో ప్ర‌తిపాద‌న వ‌స్తోంది.ఒక‌వేళ ఇప్పుడు ఉన్న ఇద్ద‌రినీ తొలగిస్తే మాత్రం స్పీక‌ర్‌కు మంత్రి ప‌ద‌వి ఖాయ‌మ‌నే చెప్ప‌వ‌చ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube