ఇక టీఆర్ఎస్ పార్టీ మరో సారి ఉద్యమ పంథాను ఎంచుకోనున్నదా?

Will The Trs Party Once Again Choose The

తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి ఉంది.అయితే ఒకప్పటితో పోలిస్తే ప్రతిపక్షాలు ప్రభుత్వంపై చేస్తున్న దాడి మాత్రం పెరిగిందని చెప్పవచ్చు.

 Will The Trs Party Once Again Choose The-TeluguStop.com

అయితే చాలా వరకు టీఆర్ఎస్ ఇప్పుడు పాలనపైనే పెద్ద ఎత్తున దృష్టి పెడుతున్న పరిస్థితుల్లో రానున్న కాలంలో ఇక టీఆర్ఎస్ పార్టీ మరోసారి ఉద్యమ పంథాను ఎంచుకోనున్నట్లు తెలుస్తోంది.ఎందుకంటే ప్రస్తుతం క్షేత్ర స్థాయిలో బీజేపీ యువతే టార్గెట్ గా దూసుకు పోతున్న తరుణంలో ఇప్పటికే బీజేపీ కేసీఆర్ పై యువతలో వ్యతిరేకత నింపడంలో చాలా సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు.

అయితే  ఇలా టీఆర్ఎస్ ఆలస్యం చేస్తూ పోతే రానున్న రోజుల్లో టీఆర్ఎస్ పట్ల ప్రజల్లో వ్యతిరేకత అనేది బలంగా వెళ్ళి ఎన్ని ప్రజాకర్షక నిర్ణయాలు తీసుకున్నా ప్రజల్లోకి బలంగా వెళ్లని పరిస్థితి ఉంటుంది.

 Will The Trs Party Once Again Choose The-ఇక టీఆర్ఎస్ పార్టీ మరో సారి ఉద్యమ పంథాను ఎంచుకోనున్నదా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ఆ సమయంలో చేయడానికి ఎటువంటి అవకాశం ఉండదు.

అయితే టీఆర్ఎస్ మాత్రం చాలా బలంగా ముందుకెళ్ళే అవకాశం కనిపిస్తోంది.అయితే కేసీఆర్ వ్యూహాలు అంత సులభంగా అర్ధం కావు కాబట్టి ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో, ఆ నిర్ణయం వెనుక ఎటువంటి బలమైన వ్యూహం ఉంటుందో చెప్పలేని పరిస్థితి ఉంటుంది.

అయితే బీజేపీ మాత్రం ఏదైతే వారు ఎంచుకున్న పంథాను మాత్రమే ఫాలో అవుతూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున టీ ఆర్ఎస్ వ్యతిరేక ప్రచారాన్ని చేస్తున్న పరిస్థితి ఉంది.

అయితే టీఆర్ఎస్ మరో సారి ఉద్యమ పంథాను ఎంచుకుంటే తెలంగాణ రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోనున్నాయి.ఇక అప్పడు తెలంగాణ అసలు రాజకీయం మొదలవుతుంది.ఇక సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రోజులకే రాజకీయ పార్టీలు తమ వ్యూహాన్ని మరింతగా అమలుపరిచే అవకాశం ఉంది.

మరి మరోసారి టీఆర్ఎస్ ఉద్యమ పంథాను ఎంచుకుంటే రాజకీయాలు మరింత వేడెక్కే అవకాశం ఉంది.

#Apddy #Bandi Sanjay #Trs #Telangana #@trspartyonline

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube