టీఆర్ఎస్ ఇక మళ్ళీ ఎదురుదాడి అస్త్రాన్ని ప్రయోగించనుందా?

టీఆర్ఎస్ పార్టీకి ఇది రెండో దఫా ప్రభుత్వం.రెండు ఎన్నికలలో కూడా టీఆర్ఎస్ కు ఎదురులేకుండా పోయింది.

 Will The Trs Launch A Counterattack Again, Kcr, Trs Party-TeluguStop.com

ప్రతిపక్షాలకు విమర్శల విషయంలో ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా మాటకు ప్రతి మాట ఇస్తూ ప్రతిపక్షాలను ఇరుకున పెట్టడంలో టీఆర్ఎస్ సఫలమైందనే చెప్పవచ్చు.అయితే ఎప్పుడూ మనకు అనుకూల పరిస్థితులు ఎలాగైతే ఉండవో టీఆర్ఎస్ కు కూడా గడ్డు కాలం నడిచిందనే చెప్పవచ్చు.

నిరుద్యోగుల ఆగ్రహం, హైదరాబాద్ వరదలు, డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇలా టీఆర్ఎస్ ఇచ్చిన ముఖ్య హామీలు నెరవేర్చడంలో విఫలమవడంతో ప్రజల్లో కొంత అగ్రహావేశాలు పెళ్లిబుకాయి.

దాని ఫలితమే దుబ్బాకలో ఓటమి చెందడం, గ్రేటర్ లో అమాంతంగా సీట్లు తగ్గిపోవడం లాంటి పరిణామాలు సంభవించ్చాయి.

అయితే మరల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించడంతో టీఆర్ఎస్ లో జోష్ వచ్చిందనే చెప్పవచ్చు.అయితే మరల త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్ల హామీ, ఉద్యోగులకు పీఆర్సీ లాంటి హామీల అమలుకు నోచుకుండటంతో ఒక్కసారిగా రాష్ట్రంలో టీఆర్ఎస్ అనుకూల వాతావరణం ఏర్పడింది.

అయితే ఇప్పుడు మరల పాత టీఆర్ఎస్ ఎలాగైతే విజ్రుంభించిందో అలా మాటలకు పదును పెట్టే అవకాశాలు ఉన్నాయి.ఈ దూకుడు నాగార్జున సాగర్ ఉప ఎన్నిక వరకు టీఆర్ఎస్ కొనసాగిస్తుందో లేదో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube