దళిత బంధు ఎజెండాగానే హుజురాబాద్ లో టీఆర్ఎస్ ప్రచారం సాగనున్నదా?

ప్రస్తుతం తెలంగాణలో హుజురాబాద్ ఉప ఎన్నిక అంశం హాట్ టాపిక్ గా ఉన్న విషయం తెలిసిందే.అయితే ఏ పార్టీకి ఎలా ఉన్నా టీఆర్ఎస్ కు మాత్రం ఇది కంచుకోటగా ఉన్న పరిస్థితి ఉంది.

 Will The Trs Campaign In Huzurabad Continue As The Dalit Bandhu Agenda, Trs Part-TeluguStop.com

అయితే ఇప్పుడు టీఆర్ఎస్ పై కొద్దిగా ప్రజల్లో వ్యతిరేకత మొదలైందన్న తీవ్ర ప్రచారం నేపథ్యంలో హుజురాబాద్ లో గెలుపు టీఆర్ఎస్ కు అనివార్యంగా మారింది.అయితే ప్రస్తుతం ఈటెల ఆత్మ గౌరవం నినాదంతో బీజేపీ తరపున బరిలో ఉన్నాడు.

అయితే ఈటెల రాజేందర్ కు సానుభూతి అనేది కొంత సానుకూలమైనటువంటి అంశమైనప్పటికి టీఆర్ఎస్ కు హుజూరాబాద్ లో సానుకూలమైనటువంటి అంశం ఏమీ లేదు.అందుకే హుజూరాబాద్ లో దళిత సామాజిక వర్గం ఎక్కువగా ఉంది కాబట్టి దళితుల ఎజెండా టీఆర్ఎస్ కు హుజూరాబాద్ లో గెలవడానికి అదనపు బలాన్ని ఇస్తున్నదని టీఆర్ఎస్ భావిస్తున్న పరిస్థితి ఉంది.

అయితే టీఆర్ఎస్ ప్రచారంలో ప్రస్తుతానికి అయితే దళిత బంధు అంశాన్ని ప్రచారంలో పెద్దగా ఉపయోగించనప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో దళిత బంధు అన్ని కుటుంబాలకు ఇంకా పూర్తి స్థాయిలో లభించలేదు కాబట్టి అందరికీ పూర్తి స్థాయిలో దళిత బంధు చేరింది అని పూర్తి స్థాయిలో నిర్ధారించుకున్న తరువాత కేసీఆర్ బహిరంగ సభతో దళిత బంధుపై టీఆర్ఎస్ వినూత్న రీతిలో ప్రచారం చేసే అవకాశం కనిపిస్తోంది.

Telugu Cm Kcr, Dalitha Bandhu, Etela Rajender, Huzurabad, Trs Huzurabad, Trs, Ts

అయితే ఇప్పుడు ఈటెల పైనే ప్రచారంలో పెద్ద ఎత్తున టీఆర్ఎస్ ఫోకస్ చేస్తున్నది.అయితే దళితబంధు ను నిలిపివేయాలని చెప్పి ఎన్నికల కమిషన్ కు ఈటెల రాజేందర్ లేఖ రాసాడని టీఆర్ఎస్ కు బీజేపీకి మధ్య సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్ నడుస్తోంది.ఇందులో ఎంత వరకు వాస్తవం ఉందనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube