తెలంగాణ శాసన మండలి రద్దవుతుందా ...?

ఏపీలో శాసనమండలిని రద్దు చేస్తూ జగన్ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది.ముఖ్యంగా శాసనమండలి వల్ల ఉపయోగం ఉందా లేదా అనే చర్చ కూడా తెరమీదకు వచ్చింది.

 Will The Telangana Legislative Council Be Dissolved-TeluguStop.com

ఏపీ శాసనమండలిలో అధికార పార్టీ వైసీపీ బలం తక్కువగా ఉండడంతో, ప్రతి బిల్లును అక్కడ తెలుగుదేశం పార్టీ అడ్డుకుంటూ ప్రభుత్వ నిర్ణయాలు అమలుకాకుండా చూస్తోంది.ఇది ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది.

ఈ నేపథ్యంలో మండలిని రద్దు చేయాలనే ఆలోచన జగన్ ఎప్పటి నుంచో చేస్తున్నారు.దీనికి ఒక సాకుని కూడా చూపించారు.

Telugu Apcm, Ap Ycp, Aplegislative, Telangana, Trslegislative-Political

శాసనమండలి నిర్వహణకు ప్రతి ఏటా కోట్ల రూపాయలు ఖర్చవుతుందని, ఇప్పటికే ఆర్థిక కష్టాల్లో ఉన్న ఏపీకి ఇది అవసరమా అనే చర్చకు తెర లేపారు.దాని కోసమే కౌన్సిల్ ను రద్దు చేస్తున్నట్లు జగన్ ప్రకటించారు.దీనికి కేంద్రం కూడా సహకరిస్తోందని వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో జగన్ నిర్ణయం దాదాపు అమలయ్యేలా కనిపిస్తోంది.ఈ నేపథ్యంలో జగన్ మిత్రుడు కేసీఆర్ తెలంగాణలో శాసనమండలిని రద్దు చేయబోతున్నారనే వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది.

ఏపీ తెలంగాణలో రాజకీయ పరిస్థితులు చూసుకుంటే వేరువేరుగా ఉన్నాయి.

Telugu Apcm, Ap Ycp, Aplegislative, Telangana, Trslegislative-Political

ఏపీలో అధికార పార్టీ వైసీపీ కి మండలి సభ్యులు తక్కువగా ఉంటే తెలంగాణలో అధికార పార్టీ టిఆర్ఎస్ కు ఎక్కువగా ఉన్నారు.తెలంగాణ కౌన్సిల్ లో మొత్తం 40 మంది సభ్యులు ఉంటే.అందులో 26 మంది టీఆర్ఎస్ పార్టీకి చెందిన వారు కావడంతో కేసీఆర్ కు ఇప్పటికిప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేవు.

దీంతో కెసిఆర్ కు పెద్దగా ఇబ్బంది లేదు.అయితే ఏపీలో జగన్ ప్రభుత్వం చెబుతున్నట్టుగా శాసన మండలి ఆర్థిక భారం అనే చర్చ దేశవ్యాప్తంగా జరుగుతున్న నేపథ్యంలో కేసీఆర్ కూడా జగన్ ఆలోచనకు జై కొట్టి మండలిని రద్దు చేసే అవకాశం లేకపోలేదు.

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కేవలం ఆరు రాష్ట్రాల్లో మాత్రమే మండలి ఉంది.దీంతో కేంద్రం కూడా అన్ని రాష్ట్రాల్లో మండలిని తీసివేసే ఆలోచనలో ఉంది.

ఈ పరిస్థితుల్లో కెసిఆర్ ఆలోచన ఏ విధంగా ఉంటుంది అనేది తేలాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube