రేవంత్ టీం రానున్న ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనుందా?

Will The Rewanth Team Play A Key Role In The Upcoming Elections

తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి ఉంది.అయితే రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా నియామకం అయిన తరువాత సాధ్యమైనంత వరకు సీనియర్ లను కలుపుకొని పోవడానికి ప్రయత్నిస్తూ తన దైన వ్యూహ రచనతో ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది.

 Will The Rewanth Team Play A Key Role In The Upcoming Elections-TeluguStop.com

అయితే కాంగ్రెస్ లో ఒక్క తాటిపై అందరూ ఉండటం చాలా కష్టమైన పని.అందుకే రేవంత్ పీసీసీ చీఫ్ గా నియామకం అయిన తరువాత కాంగ్రెస్ సీనియర్ లను కలసి తనతోపాటు కలుపుకొని పోదామని ప్రయత్నించినా ఆ ప్రయత్నం ఫలించలేదు.అందుకే ఇప్పుడు రేవంత్ తనతో పాటు కలిసి వస్తున్న నాయకులను ప్రోత్సహిస్తూ తన కంటూ ఒక టీం ను ఏర్పాటు చేసుకుంటున్న పరిస్థితి ఉంది.
ఎందుకంటే ఎలాగూ సీనియర్ లు కలసి వస్తున్న పరిస్థితి లేకపోవడంతో తన ఆలోచనలను, వ్యూహాలను అమలుపరచడానికి అంటూ ఒక నాయకత్వం లేకపోతే కాంగ్రెస్ ను బలోపేతం చేసే దిశగా రేవంత్ వ్యూహాలు సఫలమయ్యే పరిస్థితి లేదు.

కావున వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రేవంత్ కు నమ్మకమైన వ్యక్తులతో ఏర్పాటైన టీం కీలక పాత్ర పోషించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  అయితే నిరుద్యోగ సైరన్, దళిత గిరిజన దండోరా పేరిట ఏర్పాటు చేసిన సభలు సక్సెస్ కావడంతో ఇక మరింత దూకుడుగా ముందుకెళ్ళే ఆలోచనలో రేవంత్ ఉన్నట్లు తెలుస్తోంది.

 Will The Rewanth Team Play A Key Role In The Upcoming Elections-రేవంత్ టీం రానున్న ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనుందా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే కాంగ్రెస్ కు బీజేపీకి మధ్య ఇప్పుడు రెండో ప్రత్యామ్నాయ స్థానం కోసం పోటీ జరుగుతున్న పరిస్థితుల్లో ఒకప్పటితో కాంగ్రెస్ మాత్రం ఎంతో కొంత మెరుగైన స్థితిలో ఉంటుందనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.మరి రానున్న రోజుల్లో రేవంత్ వ్యూహాలు ఎంత మేరకు కాంగ్రెస్ ను విజయం దిశగా సాగించేందుకు దోహదపడుతాయనేది చూడాల్సి ఉంది.

#Bjp #@BJP4Telangana #Revanth Reddy #PCC #Etala Rajender

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube