టెస్టుల్లో దుమ్మురేపుతున్న పాకిస్థాన్ జట్టు.. టీమిండియాతో తలపడే ఛాన్స్ ఉంటుందా..?

ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ లో భాగంగా ప్రస్తుతం వివిధ దేశాల క్రికెట్ జట్లు ఆటలు ఆడుతున్నాయి.పాకిస్థాన్ తాజాగా బంగ్లాదేశ్ జట్టుతో టెస్ట్ సిరీస్ ఆడింది.

 Will The Pakistan Team, Which Is Dusting Off In The Tests, Have A Chance To Face-TeluguStop.com

ఇందులో రెండు టెస్టులను కూడా గెలుచుకుని పాకిస్థాన్ జట్టు ఆశ్చర్యపరిచింది.అయితే ఈ సిరీస్ లో భారీ ఘన విజయం సాధించడంతో డబ్ల్యుటీసీ జాబితాలో పాకిస్థాన్ రెండో స్థానానికి ఎగబాకింది.

అంతేకాదు టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్స్ కు మరింత దగ్గరయింది.

ఢాకా టెస్ట్ తర్వాత ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో పాకిస్థాన్ రెండో స్థానంలో నిలిచింది.

శ్రీలంక జట్టు రెండు విజయాలతో 24 పాయింట్లతో మొదటి స్థానంలో ఉంది.పాకిస్థాన్ 3 విజయాలతో ఒక పరాజయంతో 36 పాయింట్లతో 2వ స్థానంలో ఉంది.

భారత జట్టు కూడా మూడు విజయాలతో ఒక ఓటమితో రెండు డ్రాలతో 42 పాయింట్లతో మూడవ స్థానంలో ఉంది.అయితే ఈ టెస్ట్ ఛాంపియన్షిప్ ట్రోఫీలో భాగంగా పాక్, టీమిండియా తలపడే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Telugu Latest, Pakistan, India, Matches-Latest News - Telugu

ఇక ఢాకా టెస్ట్ సిరీస్ విషయానికి వస్తే.పాకిస్తాన్ రెండో టెస్ట్ మ్యాచ్ లో ఎనిమిది వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ పై ఘన విజయం సాధించింది.తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ జట్టు కేవలం 87 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది.నలుగురు ఆటగాళ్లు డకౌట్ అయ్యారు.సాజిద్ ఖాన్ బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్ల‌ను ఔట్ చేయడంలో కీలకపాత్ర పోషించాడు.ఒకే ఒక్క సిరీస్ లో అతడు 12 వికెట్లను పడగొట్టి అద్భుతంగా రికార్డు సృష్టించాడు.

బ్యాటింగ్ లోనూ పాకిస్థాన్ బాగా రాణించింది.పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్లు ఏకంగా 300 పరుగులు చేశారు.

ఈ జట్టులోని నలుగురు ఆటగాళ్లు హఫ్ సెంచరీతో బంగ్లాదేశ్ బౌలర్లను ఉతికి ఆరేశారు.ఫాలోఅప్ ఇన్నింగ్స్‌లో దాదాపు ఇదే సీన్ రిపీట్ అయ్యింది.

దాంతో బంగ్లాదేశ్ కనీస పోటీ కూడా ఇవ్వకుండా పరాజయం పాలయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube