కృష్ణా జలాల వివాదం రేవంత్ కు ప్లస్ అవుతుందా!

ఊరించి.ఉడికించి.

 Will The Krishna Waters Dispute Be A Plus For Rewanth! , Revant Reddy, Kcr, Ys J-TeluguStop.com

తనను కాంగ్రెస్ అధిష్టానం ఇలా పీసీసీ ఛీఫ్ గా ప్రకటించిందో లేదో అప్పుడే రేవంత్ రెడ్డి యాక్షన్ షురూ అయిందని పలువురు చర్చించుకుంటున్నారు.టీఆర్ఎస్ పార్టీకి కొరకరాని కొయ్యలా మారిన రేవంత్ రెడ్డి నైజయే తనకు పీసీసీ పదవి వరించేలా చేసిందట.

ఎంతో మంది సీనియర్లు పోటీలో ఉన్నా కూడా.మొన్నా మధ్యే టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి వలస వచ్చిన రేవంత్ రెడ్డికి టీపీసీసీ అధ్యక్ష పదవి దక్కడానికి ఆయన దూకుడే కారణమని చాలా మంది విశ్వసిస్తారు.

ఆ దూకుడే లేకే కాంగ్రెస్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చాక కూడా ఇంతలా వెనుకబడిందని అంటారు.

ప్రస్తుతం రాష్ట్రంలో రెండు అంశాలు హాట్ హాట్ గా నడుస్తున్నాయి.

అందులో ఒకటి కృష్ణా జలాల వివాదం కాగా, మరోటి హుజురాబాద్ ఉప ఎన్నిక.కృష్ణా జలాల వివాదాన్ని పెద్దది చేసి ఎలాగైనా జనాల్లో సెంటిమెంట్ రగిలించి… హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఓట్లు వేయించుకోవాలని టీఆర్ఎస్ నేతలు చూశారు.

కేంద్ర ప్రభుత్వ వైఖరి మూలానే ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కృష్ణా జలాలను అక్రమంగా తరలించుకు పోతుందని జనాల్లోకి వెళ్లేలా చేసి హుజురాబాద్ ఉప ఎన్నికలలో బీజేపీ కి ఓట్లు పడకుండా చేయాలని టీఆర్ఎస్ నేతల ప్లాన్ గా తెలుస్తోంది.

Telugu Ap Cm Ys Jagan, Revant Reddy-Telugu Political News

కానీ ఊహించని విధంగా టీపీసీసీ కెప్టెన్ పదవి రేవంత్ రెడ్డికి దక్కడంతో టీఆర్ఎస్ నాయకులు ఆలోచనలో పడ్డారని పలువురు చర్చించుకుంటున్నారు.రేవంత్ రెడ్డి దక్షిణ తెలంగాణ కు చెందిన నేత కనుక ఆయన దక్షిణ తెలంగాణకు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్ని ప్రాజెక్టులు తెచ్చారని ప్రశ్నించే అవకాశం ఉందని మదనపడుతున్నారట.ఇలా టీఆర్ఎస్ నాయకులు తమకు అనుకూలంగా మలుచుకుందామని భావించిన కృష్ణా జలాల వివాదం ఇలా అవడంతో తెగ కంగారు పడుతున్నారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube