తెలంగాణ కాంగ్రెస్ ను హైకమాండ్ లైట్ తీసుకుంటుందా?

రాష్ట్రంలో తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారయిందని చెప్పవచ్చు.ఇటు ఎన్నికల్లోనూ గెలుపు లేక, నాయకుల మధ్యలో ఐక్యత లేక ప్రజల్లో రోజురోజుకు పలుచబడుతున్న పరిస్థితి నెలకొంది.

 Will The High Command Take The Telangana Congress Lightly-TeluguStop.com

వరుస ఉప ఎన్నికల్లో పరాజయం పాలవుతూ, ఇక ఖచ్చితంగా నెగ్గుతుందనుకున్న నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో సైతం ఓడిపోవడంతో ఇక రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ బలహీనపడిందనే వాదనకు బలం చేకూరినట్టయింది.అయితే తెలంగాణలో కాంగ్రెస్ ఇంతలా దిగజారిపోతున్నా కాంగ్రెస్ హై కమాండ్ మాత్రం నిమ్మకు నీరెత్తిన్నట్టు వ్యవహారిస్తోంది.

అయితే తెలంగాణ కాంగ్రెస్ ను హై కమాండ్ లైట్ తీసుకుందా అనే వాదన వినిపిస్తోంది.ఎప్పటి నుండో పార్టీలో ఆధిపత్య పోరుకు చరమగీతం పాడాలని, తెలంగాణ కాంగ్రెస్ నేతలకు హైకమాండ్ సూచిస్తున్నా కాంగ్రెస్ నేతలు హైకమాండ్ సూచనలను పెడ చెవినపెట్టారు.

 Will The High Command Take The Telangana Congress Lightly-తెలంగాణ కాంగ్రెస్ ను హైకమాండ్ లైట్ తీసుకుంటుందా-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అందుకే నేతలు మారడం లేదని పార్టీ ప్రక్షాలన చేసినా యథాతథంగా నేతలు వ్యవహరిస్తుండడంతో ఇక హైకమాండ్ వేచి చూసే ధోరణిని ఎంచుకుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఎన్ని ఓటములు ఎదురైనా ఒక్కసారి కూడా ఓటమిపై సమీక్ష జరిపిన దాఖలాలు లేవు.

అయితే ఆధిపత్య పోరును తగ్గించుకొని ప్రజా సమస్యలపై పోరాడటంపై కాంగ్రెస్ దృష్టి పడితే బాగుంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.మరి కాంగ్రెస్ లో ఎప్పుడు కదలిక వస్తుందనేది చూడాల్సి ఉంది.

#CongressLeader #Sonia Gandhi #CongressHigh #Taken Light #PCC Chief

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు