గత రెండు విడతల ఎన్నికల్లో తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో ప్రభుత్వ పని తీరు ఆధారంగా ఎన్నికలు జరిగేవి.కాని ప్రస్తుతం తెలంగాణలో ఆ వాతావరణం పూర్తిగా మారిపోయింది.
ఇప్పడు తెలంగాణలో బీజేపీ క్రమంగా బలపడిన తర్వాత రాజకీయ వాతావరణం పూర్తిగా మారిపోయింది.ఒకప్పుడు ఎన్నికల్లో మద్దతు తెలిపే సమయంలో తప్ప కులాల ప్రస్తావన విషయం వచ్చేది కాదు.
కాని ఇప్పుడు బీజేపీ బలపడుతున్న పరిస్థితులలో, ఇతర రాజకీయ పార్టీలు కూడా ప్రత్యామ్నాయంగా కులం అంశాన్ని తెరపైకి వస్తున్నాయి.
తాజాగా గంగపుత్రులు మంత్రి తలసాని చేసిన వ్యాఖ్యలను దుమారం చేయడం, దానిని అదునుగా తీసుకొని పార్టీలు రాజకీయ అవసరాల కోసం ఈ అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్న పరిస్థితి ఉంది.
అంతేకాక తాజాగా విద్యాసాగర్ రావు వ్యాఖ్యలను కూడా పెద్ద దుమారం చేసిన పరిస్థితి మనం చూశాం.ఏది ఏమైనా రాష్ట్ర ప్రగతివి ఇటువంటి ఘటనలు విఘాతం కలిగిస్తాయి.
ప్రభుత్వ పనితీరు ఆధారంగా విమర్శలు ఉండాలి తప్ప ఇతర అంశాల ప్రాతిపదికన రాజకీయాలు చేయకూడదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.చూద్దాం భవిష్యత్తు తెలంగాణ రాజకీయ ముఖచిత్రం ఎలా ఉంటుందనేది చూడాల్సి ఉంది.
.