ప్రజా చైతన్య యాత్రతో కాంగ్రెస్ పుంజుకోనుందా?కలిసికట్టుగా కదిలివచ్చేనా?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు బలపడేందుకు ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది.అయితే ప్రజా సమస్యలపై కాకుండా అంతర్గత పోరుతో  కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా ప్రచారంలో నిలుస్తున్న పరిస్థితి ఉంది.

 Will The Congress Revive Itself With The Praja Chaitanya Yatra Can It Move Toget-TeluguStop.com

అయితే పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టాక కాంగ్రెస్ ఎంతో కొంత పుంజుకున్న మాట వాస్తవం.అయితే ప్రస్తుతం కళ్లాలలోకి కాంగ్రెస్ నినాదంతో ముందుకెళ్తున్న కాంగ్రెస్ కొంత మేర రైతుల అభిప్రాయాలను స్వీకరించే ప్రయత్నం చేస్తోంది.

అయితే కొన్ని చోట్ల రేవంత్ రెడ్డికి రైతుల నుండి నిరసన సెగలు తగులుతుండటంతో ఇక ఒక్కరోజుకే ఈ కార్యక్రమాన్ని నిలిపివేసింది.అయితే త్వరలో కాంగ్రెస్ సీనియర్ లు అందరినీ ఏకం చేసే విధంగా ప్రజా చైతన్య యాత్ర చేపట్టనున్న విషయం తెలిసిందే.

Telugu @revanth_anumula, Telangana-Political

అయితే ఈ ప్రజా చైతన్య యాత్రపైనే కాంగ్రెస్ పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్న నేపథ్యంలో ఈ ప్రజా చైతన్య యాత్రలోనైనా అందరూ కలసి వస్తారా లేదా అన్నది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద ఎత్తున ఉత్కంఠగా మారింది.అయితే ప్రజా చైతన్య యాత్ర విజయవంతంగా కొనసాగితే కాంగ్రెస్ కు పునర్జన్మ అని చెప్పవచ్చు.అయితే ఇప్పటి వరకు దీనిపై స్పష్టమైన కార్యాచరణ అనేది ప్రకటించని పరిస్థితి ఉంది.కానీ ప్రజా చైతన్య యాత్ర పట్ల కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఉత్సాహంగా ఉన్న పరిస్థితి ఉంది.

ప్రభుత్వం మాత్రం కాంగ్రెస్ పార్టీని పెద్దగా పట్టించుకుంటున్న పరిస్థితి లేదు.అయితే రైతుల నుండి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది.అందుకే ఇటు బీజేపీ, కాంగ్రెస్ కూడా రైతుల సమస్యలపై పెద్దగా స్పందించని పరిస్థితి ఉంది.ప్రతి ఒక్క రైతు కూడా తమ ధాన్యాన్ని కొనటం లేదనే ఆగ్రహంతో ఉన్న పరిస్థితి ఉంది.

మరి కాంగ్రెస్ ప్రజా చైతన్య యాత్ర ఏ మేరకు కాంగ్రెస్ ను బలోపేతం చేస్తుందనేది చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube