ఆ స్థానాన్ని కాంగ్రెస్ నిల‌బెట్టుకుంటుందా.. బీజేపీకి వ‌దులుతుందా?

తెలంగాణ‌లో బీజేపీ బ‌ల‌ప‌డ‌క‌ముందు టీఆర్ ఎస్ కు ధీటుగా పోరాడింది కాంగ్రెస్‌.కానీ కేసీఆర్ త‌న చాక‌చ‌క్యంతో కాంగ్రెస్‌లోని గ్రూపు రాజ‌కీయాల‌ను వాడేసుకుని అంద‌రినీ చీల్చేశారు.

 Will The Congress Retain That Position Will It Give Up To The Bjp, Revanth Bjp,-TeluguStop.com

త‌నుకు కావాల‌నుకున్న వారిని పార్టీలోకి తీసుకుని మిగ‌తా వారికి ఉనికే లేకుండా చేశారు.దీంతో ప్ర‌జ‌ల్లో కాంగ్రెస్ ప‌ట్ల ఆశ‌లు స‌న్న‌గిల్లాయి.

ఇక ఎలాంటి పోరాటాలు కూడా చేయ‌క‌పోవ‌డంతో ఆ పార్టీ అస‌లు ప్ర‌జ‌ల త‌ర‌ఫున పోరాడుతుందా అనే అనుమానాలు క‌లిగాయి.

ఇక దీన్నే ఆస‌రాగా చేసుకుని బీజేపీ దూసుకుపోయింది.

అనూహ్యంగా బ‌లాన్ని పెంచేసుకుని రాష్ట్రంలో తామే ప్ర‌తిప‌క్షమ‌ని ప్ర‌క‌టించుకుంది.ఒక‌నొక స‌మయంలో రాష్ట్రంలో త్వ‌ర‌లో తామే అధికారంలోకి వ‌స్తామంటూ ప్ర‌క‌టిస్తున్నారు క‌మ‌ల‌నాథులు.

ఇక రాష్ట‌రంలోఉన్న అన్ని స‌మ‌స్య‌ల‌పై బీజేపీ నిరంత‌రంగా పోరాడుతూ ప్ర‌జ‌ల్లో న‌మ్మ‌కాన్ని కాపాడుకుంటోంది.అయితే దుబ్బాకతోపాటు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అనూహ్యంగా పుంజుకున్న బీజేపీ నేతలు ఎక్కడికో వెళ్లిపోయార‌ని చెప్పాలి.

ఇక బండి సంజయ్ మాత్రం తామే అధికారంలోకి వ‌స్తామ‌ని ప్ర‌క‌టిస్తూ కార్య‌క‌ర్త‌ల్లో ధైర్యం నింపుతున్నారు.

Telugu @revanth_anumula, Revanth Reddy, Telangana, Tpcc-Telugu Political News

ఇలాంటి క్లిష్ట స‌మ‌యంలో ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి టీపీసీసీ ప్రెసిడెంట్ కావడంతో బీజేపీకి కాస్త టెన్ష‌న్ ప‌ట్టుకుంది.సీనియర్లందరినీ కాద‌ని మ‌రీ ఫైర్ బ్రాండ్ అనే న‌మ్మ‌కంతో రేవంత్‌కు ప్రెసిడెంట్ ప‌ద‌వి క‌ట్టబెట్టింది కాంగ్రెస్ అధిష్టానం.ఇక ఆ న‌మ్మ‌కాన్ని నిలబెట్టుకునేందుకు రేవంత్ ఇప్ప‌టికే శతవిధాలా ప్రయత్నిస్తాడని అంద‌రూ చెబుతున్నారు.

ఇక కేసీఆర్ తో కూడా రేవంత్‌రెడ్డికి వ్య‌క్తిగత వైరం ఉండ‌టంతో మ‌రింత రెచ్చిపోయే ప్ర‌మాదం ఉంది.దీంతో మ‌ళ్లీ కాంగ్రెస్ ఫామ్‌లోకి వ‌చ్చి ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పాత్ర పోసిస్తుంద‌ని అంతా అనుకుంటున్నారు.

కానీ బీజేపీలో బ‌ల‌మైన నేత‌లు ఉండ‌టం, ఇక రేవంత్ వ్య‌తిరేకులు కూడా బీజేపీలో చేరుతార‌నే ప్ర‌చారం జ‌ర‌గ‌డంతో బీజేపీ బ‌లం పెరిగి ప్ర‌తిప‌క్ష పాత్ర‌ను కాపాడుకోవాల‌ని చూస్తోంది.ఇక అసెంబ్లీలో బీజేపీ కంటే కాంగ్రెస్‌కే ఎక్కువ సీట్లు ఉన్నాయి.

చూడాలి మ‌రి రేవంత్ ఎలా ముందుకెల్తారో.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube