ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ( Congress party ) సౌత్ రాష్ట్రాలపై గట్టిగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది.ఒకప్పుడు సౌత్ రాష్ట్రాలలో బలంగా ఉన్న కాంగ్రెస్.
ప్రస్తుతం ఒక్క కర్నాటక మినహా మిగిలిన రాష్ట్రాలలో చాలా బలహీనపడింది.ముఖ్యంగా ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.2014 ఎన్నికల తరువాత ఏపీ కాంగ్రెస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది.దీంతో ముఖ్యంగా రాష్ట్ర విభజన విషయంలో ఏపీకి కాంగ్రెస్ తీరని అన్యాయం చేసిందనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ ను పాతాళంలోకి నెట్టేశారు.
ఇక అప్పటి నుంచి ఏపీలో అసలు కాంగ్రెస్ ఉందనే మాటే చాలమంది మరచిపోయారు.

ఇక ప్రస్తుతం కాంగ్రెస్ అధిష్టానం దృష్టి మళ్ళీ ఏపీపై పడింది.ఎలాగైనా ఏపీలో పూర్వ వైభవం పొందాలని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు.అందుకే ఏపీలో పార్టీ బలోపేతం కూడా ప్రణాళికలను సిద్దం చేసుకుంటున్నారు.
జాతీయ నేతలు తరచూ ఏపీలో పర్యటించే విధంగా కాంగ్రెస్ హైకమాండ్ ప్లాన్స్ వేస్తున్నట్లు పోలిటికల్ సర్కిల్స్ లో వార్తలు వస్తున్నాయి.వచ్చే నెలలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ( Rahul Gandhi ) ఏపీలో పర్యటించనున్నరట.

రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం ఎలాంటి చర్యలు చేపట్టాలి.ప్రజలను ఎలా ఆకర్షించాలనే దానిపై ప్రణాళిక బద్దంగా పార్టీ నేతలకు దిశనిర్దేశం చేసే అవకాశం ఉంది.ఇదిలా ఉంచితే ఏపీలో కాంగ్రెస్ పూర్వ వైభవం కోసం ప్రత్యేక హోదా అంశాన్నిప్రధాన అస్త్రంగా రాహుల్ గాంధీ ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది.భారత్ జోడో యాత్రలో భాగంగా తాము అధికారంలోకి వస్తే ఏపీకి ( AP )ప్రత్యేక హోదా ఇస్తామని తొలి సంతకం అదేనని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.
ఈ హామీని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రత్యేక హోదా కాంగ్రెస్ తోనే సాధ్యమనే విధంగా కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది.అంతే కాకుండా ఇతర పార్టీ నేతలను కూడా తిరిగి కాంగ్రెస్ లోకి ఆహ్వానించే విధంగా కాంగ్రెస్ హైకమాండ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
మరి ఏపీ విషయంలో కాంగ్రెస్ వ్యూహాలు ఎంతవరుకు ఫలిస్తాయో చూడాలి.