నేటి టీఆర్ఎస్ ధర్నాతో కేంద్రం దిగివచ్చేనా?

తెలంగాణ రాజకీయాలు రోజు రోజుకు హాట్ హాట్ గా మారుతున్న పరిస్థితి ఉంది.అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలతో ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాలు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారాయి.

 Will The Center Step Down With Today's Trs Dharn Bjp Party, Telangana Politics ,-TeluguStop.com

యాసంగి వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం.అయితే కేంద్రం యాసంగిలో వరి ధాన్యం కొనుగోలు చేస్తుందా లేదా అనే విషయంపై స్పష్టతనివ్వాలని నేడు ఇందిరా పార్క్ వద్ద టీఆర్ఎస్ పార్టీ ధర్నా చేపట్టనున్న సంగతి తెలిసిందే.

అయితే బండి సంజయ్ యాసంగి వరి వేసుకోవాలని రైతులకు చెప్పిన విషయంపై కట్టుబడి ఉన్నారా లేదా అనే విషయంలో స్పష్టతనివ్వాలని తప్పు చెప్పానని భావిస్తే రైతులకు క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాయాలని కెసీఆర్ బండి సంజయ్ కు సవాల్ విసిరిన విషయం తెలిసిందే.అయితే ఇది ఇలా ఉంటే నేడు ఏకంగా కెసీఆర్ ఆధ్వర్యంలో ధర్నా చేపడుతుండటంతో ఒక్కసారిగా దేశం చూపు ఇప్పుడు తెలంగాణపై పడింది.

అయితే వరి ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత నిచ్చే వరకు బీజేపీని వదిలిపెట్టే సమస్య లేదని కెసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో ఇక రాను రాను బీజేపీ-టీఆర్ఎస్ ఢీ అంటే ఢీ అన్న చందంగా తయారయ్యే అవకాశం ఉంది.అయితే నేడు నిర్వహిస్తున్న టీఆర్ఎస్ ధర్నాతో కేంద్రం దిగివస్తుందా లేదా అనేది చూడాల్సి ఉంది.

Telugu @bandisanjay_bjp, @bjp4telangana, Bandi Sanjay, Central, Farmmers, Naredr

అయితే కేంద్ర ప్రభుత్వం టీఆర్ఎస్ డిమాండ్లపై స్పష్టతనివ్వకుంటే ఇక రానున్న రోజులలో మరింత ఉధృతంగా భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్థానని కెసీఆర్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.మరి కేంద్రం స్పష్టతనిస్తే పోరాటం చేసి రైతుల పక్షాన టీఆర్ఎస్ ఉందనే విషయాన్ని రాజకీయ లబ్ధి గురించి వాడుకునే అవకాశం ఉంది.మరి రానున్న రోజుల్లో ఏం జరుగుతుందనేది చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube