కేసీఆర్‌పై పవర్ గేమ్ ఆడుతున్న బీజేపీ.. వ్యూహం ఫలించేనా?

తెలంగాణలో ముక్కోణపు రాజకీయం నడుస్తోంది.వచ్చే ఏడాది తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయనే ఊహాగానాల నేపథ్యంలలో ఇటు అధికార పార్టీ టీఆర్ఎస్.

 Bjp Playing Power Game On Kcr .. Will The Strategy Work?.. Telangana, Kcr, Bjp,-TeluguStop.com

అటు ప్రతిపక్షాలు కాంగ్రెస్, బీజేపీలు ఇప్పటి నుంచే మాటల యుద్ధానికి తెరతీశాయి.ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలనే పట్టుదలను ప్రదర్శిస్తోంది.

ఈ నేపథ్యంలో బీజేపీ కీలక నేత అమిత్ షా కూడా ఇటీవల తెలంగాణలో పర్యటించి వెళ్లారు.అయితే ఏ ఎన్నిక వచ్చినా కేసీఆర్ తెలంగాణ ఉద్యమకారుడు అనే నినాదాన్నే నమ్ముకుంటున్న టీఆర్ఎస్ పార్టీకి చెక్ పెట్టాలని బీజేపీ వ్యూహాలకు పదును పెడుతోంది.

గతంలో కేసీఆర్‌తో మంచి బంధాన్ని చాటుకున్న బీజేపీ ఇప్పుడు ఆయన్ను బద్ధశత్రువు లెక్కన చూస్తోంది.గతంలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఉన్న బంధం కారణంగానే 2018లో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారు.

ఇది అందరికీ తెలిసిన సత్యమే.

కానీ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుందని కేసీఆర్ గట్టిగా నమ్ముతున్నారు.

దీంతో మోదీపై కయ్యానికి కాలు దువ్వుతున్నారు.ఇటీవల పలు రాష్ట్రాల్లో బీజేపీకి అనుకూల పవనాలు వీచినా వాటిని కేసీఆర్ లెక్కచేయడం లేదు.

దీంతో కేసీఆర్‌పై బీజేపీ కూడా ఎదురుదాడికి దిగింది.కేసీఆర్ శ్రమను జాతీయ రాజకీయాలకు కాకుండా తెలంగాణకే పరిమితం చేయాలని కమలం పార్టీ కంకణం కట్టుకుంది.

Telugu Amith Sha, Bandi Sanjay, Jp Nadda, Telangana-Telugu Political News

ఈసారి తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు పర్మిషన్ ఇవ్వకూడదని బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది.కేంద్రంలో పవర్ ఉపయోగించుకుని తమకు వీలైనప్పుడు మాత్రమే ఎన్నికలు జరిగేలా ప్లాన్ వేసి తెలంగాణలో కేసీఆర్‌ను దెబ్బ కొట్టాలని బీజేపీ భావిస్తోంది.కేసీఆర్‌ను తెలంగాణ చట్రంలో ఇరికించి జాతీయ రాజకీయాల వైపు కన్ను పడకుండా చేయాలని పావులు కదుపుతోంది.ఇందులో భాగంగానే ఇటీవల అమిత్ షా కూడా కేసీఆర్‌పై విమర్శలు చేశారు.

మాంత్రికుడి మాటల వల్లే కేసీఆర్ సచివాలయం వైపు చూడటం లేదని ఆరోపించారు.మొత్తానికి కేసీఆర్‌పై బీజేపీ ఆడుతున్న పవర్ గేమ్ ఏ తీరాలకు చేర్చుతుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube