వరి ధాన్యం దెబ్బతో తెలంగాణలో బీజేపీకి కోలుకోని దెబ్బ తగలనున్నదా?

తెలంగాణలో ధాన్యం కొనుగోలు అంశం పెద్ద ఎత్తున హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే.ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ మధ్య పెద్ద ఎత్తున మాటల తూటాలు పేలుతున్న పరిస్థితి ఉంది.

 Will The Bjp In Telangana Be Dealt An Irreparable Blow By The Rice Grain Blow De-TeluguStop.com

అయితే వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనలేమని స్పష్టం చేసిన తరుణంలో రైతులు వరి ధాన్యం వేసి నష్టపోవద్దనే ఉద్దేశ్యంతో రైతులకు చెబుతున్నామని కావున వచ్చే యాసంగి సీజన్ లో కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేయబోదని కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే.అయితే వరి ధాన్యం విషయంలో బీజేపీ తెలంగాణ అధ్యక్షులు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల నుండి మొదలైన రగడ అనేక మలుపులు తిరుగుతున్న పరిస్థితి ఉంది.

బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు విసిరిన కౌంటర్ కు కేసీఆర్ విసిరిన సవాల్ కు బీజేపీ నుండి సరైన స్పందన రాకపోవడంతో బీజేపీ ఒక్కసారిగా ఇరకాటంలో పడింది.అయితే కెసీఆర్ ఢిల్లీ వెళ్ళి వచ్చిన తరువాత ఇక కేంద్ర ప్రభుత్వం కూడా తమ స్పష్టమైన వైఖరి తెలపడంతో ఇక రైతులకు బీజేపీదే బాధ్యత అన్న రీతిలో ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేసిన పరిస్థితి ఉంది.

ఏది ఏమైనా వరి ధాన్యం విషయంలో బీజేపీ తీసుకున్న నిర్ణయం, స్థానిక బీజేపీ నాయకత్వం రాజకీయం చేయడంతో ఈ విషయం చిలికిచిలికి గాలి వానలా మారిన పరిస్థితి ఉంది.

Telugu @bandisanjay_bjp, @bjp4telangana, Bandi Sanjay, Central, Cm Kcr, Farmers,

అయితే ఈ విషయంపై బీజేపీ కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ కావచ్చు ఎక్కడా కూడా మొండిపట్టు వీడడం లేదు.దీంతో రైతుల వరకు వెళ్లాల్సిన అసలు విషయం బదులు రాజకీయం అనేది పెద్ద ఎత్తున చర్చగా మారుతున్న పరిస్థితి ఉంది.వరి ధాన్యం అంశం బీజేపీని ఎంత మేరకు నష్టానికి గురిచేస్తుందన్నది చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube