ఐపీఎల్( IPL ) లో ప్రతి టీం కూడా తమదైన రీతిలో తమ సత్తా చాటుతో ముందుకు కదులుతున్న విషయం మనకు తెలిసిందే.ఇక ఇప్పటికే చాలా టీమ్ లు వైవిద్యమైన తీరును ప్రదర్శిస్తూ మొత్తానికి ఎలాగోలాగా టీమ్ ని దగ్గరుండి మరి గెలిపించుకుంటూ ముందుకు సాగుతున్నాయి.
మరి ఇలాంటి క్రమంలో కొన్ని టీమ్ లు మాత్రం అసలు గెలవడం లేదు.ముఖ్యంగా డిల్లీ, ఆర్సిబి( Delhi, RCB ) లాంటి టీమ్ లు వరుసగా ఓటమిలను చవి చూస్తూ వస్తున్నాయి.
మరి దీనికి గల కారణం ఏంటి అనేది ఆయా టీమ్ లా యాజమాన్యం పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇది ఇలా ఉంటే ఈరోజు ఢిల్లీ వర్సెస్ లక్నో సూపర్ జాయింట్స్ టీమ్ లా మధ్య ఒక భారీ మ్యాచ్ అయితే జరగబోతుంది.

ఇక ఇప్పటికే లక్నో( Lucknow ) మంచి విజయాలను అందుకుంటూ ముందుకు దూసుకెళ్తుంటే ఢిల్లీ మాత్రం ఏమాత్రం ప్రభావం చూపించలేకుండా చతికలబడిపోతుంది.మరి ఇలాంటి క్రమంలో ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్ లో ఏ టీమ్ విజయం సాధిస్తుంది అన్నదాని పైన ఇప్పుడు సర్వత్ర ఆసక్తి నెలకొంది.ఇక ఇప్పుడున్న స్టాట్స్ ప్రకారం చూసుకుంటే లక్నోకి విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టుగా కనిపిస్తుంది.ముఖ్యంగా లక్నో టీంలో కేల్ రాహుల్, నికోలాస్ పూరన్( Kale Rahul, Nicholas Pooran ) లాంటి స్టార్ ప్లేయర్లు ఉండడం ఈ టీమ్ కి చాలా వరకు కలిసి వచ్చే అంశం అనే చెప్పాలి.
ఇక ఈ టిముల్లో ఎవరో ఒక్కరు రాణించిన గాని లక్నో టీం భారీ స్కోరు అయితే చేయగలుగుతుంది.ఇక టీమ్ నిండా ప్లేయర్స్ ఉన్నప్పటికీ వాళ్ళు మ్యాచ్ పొజిషన్ ను బట్టి ఆడకుండా ఇష్టం వచ్చినట్టుగా ఆడుతున్నారు.

అందువల్లే వాళ్ళు ప్రతి మ్యాచ్ లో ఓటమిని చవి చూడాల్సిన పరిస్థితి అయితే వస్తుంది.కాబట్టి ఈరోజు ఢిల్లీ టీం గెలవాలి అంటే వార్నర్, పృద్విషా, రిషబ్ పంత్ లాంటి ప్లేయర్లు తమదైన రీతిలో విరుచుకుపడి ఆడితే తప్ప ఢిల్లీ టీమ్ ఈ మ్యాచ్ లో విజయం సాధించలేదు.ఇక ఈ మ్యాచ్ లో లక్నో టీం కి 70% గెలిచే అవకాశం ఉంటే, డిల్లీ టీం కి మాత్రం 30% గెలిచే అవకాశాలు ఉన్నాయి.